కడప లో మరో టెన్షన్ వాతావరణం నెలకొంది.. నిన్నటి వరకు పంచాయితీ ఎన్నికలు జరిగాయి. వాటిలో తుది వరకు జనాల్లో ఆసక్తి నెలకొంది. అధికార పార్టీ వైసీపీ పై చెయ్యి గా నిలిచింది. ఇకపోతే ఇప్పుడు మరో ఎన్నికలు జరగనున్నాయి.పులివెందులలో మొత్తం 26 వార్డులకు 2014లో జరిగిన ఎన్నికల్లో 25 చోట్ల వైకాపా అభ్యర్థులు విజయం సాధించారు. ఒక్క స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. ఈసారి అసలు ఎన్నికలే లేకుండా అన్ని స్థానాలను ఏకగ్రీవం చేసుకోవడంలో వైకాపా నాయకులు సఫలమయ్యారు. పరిశీలన ముగిసే నాటికి వైకాపా 42, స్వతంత్ర అభ్యర్థులవి 7 నామినేషన్లు మిగిలాయి.2014 లో 8 పురపాలక సంఘాలకు ఎన్నికలు జరిగాయి. అప్పుడు తెదేపా 4, వైకాపా 4 వాటిల్లో ఛైర్మన్‌ పీఠాన్ని దక్కించుకున్నాయి.. రాయచోటి, పులివెందులలో ఎన్నికల భేరి మోగనుంది.పులివెందుల, రాయచోటి పురపాలక సంఘాల్లో ఎక్కువ వార్డుల్లో ఒకే నామినేషన్‌ దాఖలు కావడంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌(ఎస్‌ఈసీ)కు కలెక్టర్‌ హరికిరణ్‌ 19వ తేదీన నివేదిక సమర్పించారు. దీనిపై ఎస్‌ఈసీ నిర్ణయం కోసం అధికారులు, రాజకీయ నాయకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.


పులివెందుల పురపాలక సంఘంలో మొత్తం 33 వార్డులకు 21, రాయచోటిలో మొత్తం 34 వార్డులకు 21 చోట్ల ఒక్క నామినేషన్‌ మాత్రమే దాఖలవ్వడంపై ఎస్‌ఈసీ సందేహం వ్యక్తం చేసింది. పులివెందుల పురపాలక సంఘానికి సంబంధించి అభ్యర్థులు నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకపోవడంతో అక్కడ ఎన్నికలు సజావుగానే జరిగినట్లు జిల్లా అధికారులు ఎస్‌ఈసీకి నివేదించినట్లు సమాచారం. రాయచోటి పురపాలక సంఘంలో మాత్రం నామినేషన్ల సమయంలో పలు హింసాత్మక సంఘటనలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. వీటికి సంబంధించి ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్పింగులను ఎస్‌ఈసీకి పంపించారు.


అయితే ఈ రెండు నియోజక వర్గాల్లో ఇప్పటివరకు నమోదు అయినవి, ఉపసంహరించుకున్న వి మొత్తం వివరాలను సంభందిత అధికారులు సేకరించారు. 2020 మార్చి 11 నుంచి 15వ తేదీ మధ్య జరిగిన నామినేషన్ల ప్రక్రియపై పోలీసుల వద్ద నమోదైన ఎఫ్‌ఐఆర్‌ వివరాలు జత చేశారు. జిల్లాలో మిగిలిన ఆరు పురపాలక సంఘాల్లోనూ బలవంతపు నామినేషన్ల ఉపసంహరణపై ఎస్‌ఈసీ అడిగిన నివేదికను జిల్లా అధికారులు మంగళవారం పంపినట్లు తెలిసింది..పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: