ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు ఏదైనా పని చేయడానికి చాల ఆలోచిస్తుంటారు. ఆ పని చేస్తే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని ఫీల్ అవుతూ ఉంటారు. మరికొంత మంది ఎవరు ఏం అనుకుంటే నాకేంటి అని అన్ని పనులు చేసుకుంటూ పోతుంటారు. ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండే అధికారి కలెక్టర్. ఈ ప్రభుత్వం అధికారం మనకు బ్రిటిష్ కాలం నుండి అందుబాటులోకి వచ్చింది. వాళ్ళు మన దేశం వదిలివెళ్లిన వాళ్ళు ప్రవేశ పెట్టిన విధానాలను కొన్ని కొనసాగుతూనే ఉన్నాము.

అయితే ఎన్నో సంవత్సరాలుగా ఎంతోమంది కలెక్టర్లు మన దేశానికి ఎనలేని సేవ చేశారు. ఇంకొందరు కలెక్టర్లు అయితే ప్రజల మనసులో చోటు సంపాదించుకున్నారు. మరికొందరేమో అధికారం వచ్చిందని తలబిరుసు ప్రవర్తించి ఎదుటివారి మనసుని కష్టపెట్టేవారు లేకపోలేదు. ఏదైనా పని చేయాలిసి వస్తే ఒక్కసారి నేనేంటి నా స్థాయి ఏంటి అని అనుకుని అహం భావంతో ఉంటారు కొందరు. కానీ ఉద్యోగం పక్కన పెడితే నేను సామాన్యురాలినే అని అంటుంది ఓ కలెక్టరమ్మ.  తన కార్ టైర్ ను తానే మార్చుకుంటూ తన సంస్కారాన్ని తెలియజేసారు రోహిణి సింధూరి ఐఏఎస్. ప్రస్తుతం ఆమె  వీడియో సోషల్ మీడియా లో సంచలనాన్ని సృష్టిస్తోంది. వీడియో చుసిన వారందరూ ఆమెను ప్రశంసిస్తున్నారు.

ఇక ప్రస్తుతం రోహిణి సింధూరి కర్ణాటక లోని మైసూరు జిల్లాకి కలెక్టర్‌గా వ్యవరిస్తున్నారు. ఇంకొక విషయం ఏమిటి అంటే, ఈమె  ఒక తెలుగు అమ్మాయి. ఇటీవల ఆమె కొడగు మరియు ఆ చుట్టుపక్కల పర్యాటక ప్రాంతాలు చూసేందుకు తన కారులో వెళ్లగా దారిలో ఆమె కార్ టైర్ పంక్చర్ అయ్యింది. ఆమె ఓ కలెక్టర్ కాబట్టి తన అధికారాన్ని ఉపయోగించుకుని ఉండవచ్చు…. కానీ ఆమె అలా చెయ్యలేదు. స్వయంగా  తానే ఆ కార్ టైర్ ను మార్చుకున్నారు. అటుగా వెళ్తున్న కొందరు ఆమెను గుర్తుపట్టి మీరు కలెక్టర్ కదా అని అడగగా ఆమె చిరు నవ్వు నవ్వింది. అక్కడ ఉన్నవారు తీసిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది .

మరింత సమాచారం తెలుసుకోండి: