పక్క దేశాలను పక్క రాష్ట్రాలను పొగిడే విషయంలో మనదేశంలో కాస్త ముందు వరుసలో ఉంటారు. ఇప్పుడు వ్యాక్సినేషన్ విషయంలో దాదాపు అదే జరుగుతుందనే భావన వ్యక్తమవుతోంది. మనదేశంలో వ్యాక్సిన్ ధర చాలా తక్కువగా ఉంది. 250 రూపాయలకు కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఫ్రీగానే వ్యాక్సిన్ అందిస్తారు. 250 రూపాయలు చార్జీ వసూలు చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో చాలా ఎక్కువగా ఉంది అనే ఆరోపణలు చేస్తున్నారు కొంతమంది.

250 రూపాయలు పెట్టి ప్రజలను దోపిడీ చేస్తున్నారు అనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కొంతమంది విశ్లేషకులు కొన్ని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి అమెరికాలో 1400 వరకు కరోనా వ్యాక్సిన్ ధర ఉంది. అలాగే సౌదీ అరేబియాలో దాదాపు 500 వరకు ఉన్నది. చైనాలో 2200 వరకు ఉంది యూరోపియన్ యూనియన్లో దాదాపుగా వెయ్యి రూపాయల వరకు ఉన్న సంగతి తెలిసిందే. అయినా సరే ఈ విషయాలు తెలియని చాలా మంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక మన దేశంలో ట్రయల్స్ కూడా చాలా తక్కువగా జరిగాయి అని ఆరోపణలు చేయడం ఇప్పుడు ఆశ్చర్య కరంగా మారింది. వాస్తవానికి భారత్ బయోటెక్ దాదాపుగా 25 వేల మందికి నిర్వహించింది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలామంది ఈ ట్రయల్స్ లో పాల్గొన్నారు ప్రముఖులు కూడా వ్యాక్సిన్ తీసుకున్న సంగతి తెలిసిందే. అయినా సరే ఈ విషయాలు తెలియని చాలా మంది తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. కేంద్రాన్ని ఏదో ఒక రూపంలో విమర్శించాలని భావిస్తున్న కొంతమంది పదేపదే ఈ అంశాలను టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం అనేది ఆందోళన కలిగిస్తోంది. వ్యాక్సిన్ ధర విషయంలో ఇతర దేశాలతో పోల్చే ముందు మన దేశంలో ఎంత వాళ్ళ దేశంలో ఎంత అనేది ఒకసారి పోల్చి చూసుకుంటే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: