ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ కేసులు సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ మహమ్మారి వైరస్ పేరు వింటేనే ప్రజలు మొత్తం బెంబేలెత్తిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. దేశంలో ఎక్కడ చూసినా ప్రస్తుతం కరోనా వైరస్ పేరే వినిపిస్తుంది. అందరిలో కూడా ప్రాణాపాయాన్ని కలిగిస్తుంది ఈ మహమ్మారి వైరస్. సామాన్యులు సంపన్నులు అనే తేడా లేకుండా అందరి పై పంజా విసురుతూ ఎంతోమందిని ఆస్పత్రి పాలు చేస్తుంది. అయితే ఈ మహమ్మారి వైరస్ మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతూ ఉండడం అందరినీ మరింత ఆందోళన కలిగిస్తోంది.


 అయితే ముఖ్యంగా ఈ వైరస్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి కూడా వృద్ధులకు ఈ మహమ్మారి వైరస్ సోకటం మహా డేంజర్ అంటూ వైద్యనిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా 60 సంవత్సరాలు పైబడిన వారరు వైరస్ బారిన పడితే ఇక వారి ఆరోగ్యం క్షీణించి ఏకంగా ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది అంటూ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం వృద్ధులు మాత్రమే కాదు కొన్ని కొన్ని సార్లు యువకులు కూడా ప్రాణాలు కోల్పోతున్న ఘటన వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ప్రజలు అందరూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి నేపథ్యంలో ఎంతో మంది వృద్ధులు కరోనా వైరస్ భారిన పడినా దృఢ సంకల్పంతో జయిస్తున్న ఘటనలు అందరిలో ధైర్యం నింపుతుంది.



 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ తాత ధైర్యం ముందు కరోనా తలవంచక తప్పలేదు.  ప్రస్తుతం దేశం మొత్తం  వైరస్ తో గడగడాలాడుతూ ఉంటే తాత గుండె ధైర్యం ముందు మాత్రం కరోనా వణికిపోయింది.  90 ఏళ్ల వయసులో కూడా రెండు సార్లు  వైరస్ సోకినప్పటికీ మహమ్మారి తాతను ఏమి చేయలేక పోయింది మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన అగ్లావే అనే 90 ఏళ్ల వ్యక్తి తొలిసారి  వైరస్ బారిన పడిన సమయంలో కేవలం పది రోజుల వ్యవధిలోనే కోలుకున్నాడు. ఇక ప్రస్తుతం సెకెండ్ వేవ్ వైరస్ వ్యాప్తి  సమయంలో ఇటీవల  వైరస్ బారినపడి 15 రోజుల పాటు చికిత్స తీసుకుని 90 ఏళ్ల వయసులో కూడా కరోనా వైరస్ ఉదయించిన వృద్ధుడు అందరిలో ధైర్యాన్ని నింపుతున్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: