దేశంలో కరోనా తీవ్ర రూపం దాల్చుతోంది. చాలా మంది కరోనాకు బలవుతున్నారు. ఇటువంటి సమయంలో ప్రభుత్వాలు లాక్ డౌన్, కర్వ్యూలు విధిస్తూ ప్రజలను ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నాయి. అయితే ఇటువంటి తరుణంలో కొందరు వ్యవహరించే తీరు బాధాకరంగా ఉంటోంది. సమాజం పట్ల, ప్రజల పట్ల బాధ్యతాయుతంగా లేకుండా వారు వ్యవహరిస్తున్న తీరు అందర్నీ ఆగ్రహానికి గురిచేస్తోంది.

ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బాధితులకు సాయం చేయడానికి ప్రజాప్రతినిథులు ముందుండాలి. ముఖ్యంగా ఆస్పత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ కొరత ఏర్పడుతున్న తరుణంలో ప్రజాప్రతినిథులే కీలకంగా వ్యవహరించి బాధితులకు సకాలంలో చికిత్స అందేలా చూడాలి. ప్రజలు ఇబ్బందులు పడుతున్న ఇలాంటి సమయంలో అధికార వైసీపీ నేతల తీరు వివాదాస్పదమవుతోంది. ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ప్రతి ఒక్కరూ ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఈ సమయంలో కడప జిల్లాలోని వైసీపీ నేతల తీరుపై విమర్శలు వస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఓవైపు కరోనాతో ప్రజలు వణికిపోతుంటే వైసీపీ నేతలు మాత్రం సరదాగా హార్స్ రైడింగ్ చేస్తున్నారు. రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆకెపాటి అమర్ నాథ్ రెడ్డి గారు, ప్రభుత్వ చీఫ్ విప్ srikanth REDDY' target='_blank' title='గడికోట శ్రీకాంత్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>గడికోట శ్రీకాంత్ రెడ్డి గా, కోడూరు శాసనసభ సభ్యులు ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు, కడప మేయర్ సురేష్ బాబు అకెపాటి ఎస్టేట్ లో సరదాగా గుర్రపుస్వారీ చేస్తూ గడిపారు.


ప్రస్తుతం వైసీపీ నేతల హార్స్ రైడింగ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలాంటి సమయంలో సరదాలేంటని పలువురు విమర్శిస్తున్నారు. అధికారంలో ఉన్న వైసిపి నేతలు ఇలా వ్యవహరించడం పట్ల పలువురు ఫైర్ అవుతున్నారు. ప్రజాప్రతినిధులు అయ్యి ఉండి ఇలా చేయడం బావ్యం కాదని, ఇకనైనా బాధ్యతగా వ్యవహరించాలని, కరోనా పేషెంట్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: