దేశవ్యాప్తంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా కేసులు భారీగానే పెరుగుతున్నాయి. అయితే వారం రోజుల నుంచి కూడా కరోనా కేసులలో కాస్త తగ్గుదల అనేది కనబడుతుంది. దీనితో కేంద్ర ప్రభుత్వం కూడా కాస్త ఊపిరి పీల్చుకుంటున్నది. రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు కాస్త తగ్గడంతో ఇప్పుడు రాష్ట్రాలు కూడా ఇబ్బంది పడటం లేదు. కొన్ని కొన్ని ఇబ్బందులను అధిగమించే ప్రయత్నం చేస్తున్నాయి. కరోనా మొదటిసారి కంటే కూడా ఇప్పుడు ఎక్కువగా తీవ్రత చూపించడంతో ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు.

ఇప్పుడు ఇదిలా ఉంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గడంతో పాటు రికవరీలు కూడా భారీగా పెరగాల్సిన అవసరం ఉంది అనే అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. రికవరీల విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్న సంగతి స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే రికవరీలు పెంచేందుకు తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నారు. అయితే గత రెండు రోజుల నుంచి చూసుకుంటే రోజువారి కేసులతో పోలిస్తే రికవరీ లో భారీగా నమోదవుతున్నాయి. 3 లక్షలు 48 వేలకు పైగా కేసులు నమోదయిన సంగతి తెలిసిందే.

అయితే రికవరీ లో 3 లక్షల 55 వేల పైగా నమోదయ్యాయని చెప్తున్నారు. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఏర్పడింది. దీనితో ఆస్పత్రుల మీద కూడా ఒత్తిడి తగ్గి అవకాశం ఉంటుంది అనే అభిప్రాయం కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. లేకపోతే మాత్రం పరిస్థితులు ఆందోళనకరంగా మారే అవకాశాలు ఉంటాయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని... ప్రజలు కూడా రికవరీలో మీద దృష్టిపెట్టి జాగ్రత్తగా ముందుకు వెళ్లకపోతే మాత్రం భవిష్యత్తులో పరిస్థితులు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుందని కొంతమంది హెచ్చరిస్తున్నారు. మరి భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: