జగన్ రాజకీయంగా రాటుదేలిపోయారు. ఆయన దగ్గర మాటలు ఉండవు. కేవలం యాక్షన్ మాత్రమే ఉంటుంది. ఆయన వేగంగా పావులు కదుపుతారు. చూసిన వారు తొందరపాటు అనుకుంటారు. కానీ జగన్ బాగా ఆలోచించాకే నిర్ణయం తీసుకుంటారు.

ఒక్కసారి డెసిషన్ తీసుకున్నాక మాత్రం అది అమలు అయి తీరాల్సిందే. పార్టీ టికెట్ మీద గెలిచి దాదాపుగా ఏడాదిన్నరగా వైసీపీ మీద ఘాటు విమర్శలు చేస్తూ వస్తున్న రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణంరాజుని అనూహ్యంగా అరెస్ట్ చేశారు జగన్. ఈ ఎత్తుగడను ఎవరూ అసలు ఊహించలేదు. ఢిల్లీలోనే మొత్తం టైమ్ గడుపుతున్న రాజు హైదరాబాద్ కి వచ్చీరావడంతోనే ఆయన్ని అరెస్ట్ చేసి ఏపీకి సీఐడీ అధికారులు తెచ్చారు అంటేనే స్కెచ్ ఏ రేంజిలో ఉందో అర్ధమవుతోంది.

తన ఫోటోతో తాను ఇచ్చిన బీ ఫారం తో గెలిచి తననే ధిక్కరిస్తే సీన్  ఎలా ఉంటుందో జగన్ రాజు తో పాటు వైసీపీ సభ్య సమాజానికి ఇచ్చిన సందేశంగా చెబుతున్నారు. వైసీపీలో కొందరు అసంతృప్తితో ఉన్నారని ఓ వైపు ప్రచారం సాగుతోంది. అదే టైమ్ లో రాజు మాదిరిగా రచ్చ  చేయకపోయినా ధిక్కార స్వరాలు వినిపించడానికి తయారు గా ఉన్న వారూ ఉన్నారు. మాజీ మంత్రులు కొందరు కూడా పదవులు దక్కక అసంతృప్తి తో ఉన్నారు. ఈ నేపధ్యంలో వారందరికీ ఒకే ఒక్క   షాక్ ట్రీట్మెంట్ తో జగన్ చెప్పాల్సింది చెప్పేశారు అంటున్నారు.

అదే విధంగా బయట విపక్షమని చెప్పుకుని జగన్ సర్కార్ మీద అదే పనిగా విమర్శలు చేస్తున్న వారు, ఆధారాలు లేకుండా ఏది పడితే అది మాట్లాడుతున్న వారు కూడా ఈ దెబ్బతో సెట్ అవుతారు అని అంటున్నారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు చేయడం సహజం. కానీ అవి ఒక పరిధిని దాటి ముందుకు వెళ్తనే ఇబ్బంది. రాజు కూడా హద్దులు దాటేసారు అన్న వారూ ఉన్నారు. మొత్తానికి జగన్ని వ్యక్తిగతంగా ఏ సీఎం ని అననన్ని మాటలు అంటున్న వారికి ఈ అరెస్ట్ ఒక పాఠంగా ఉంటుందని కూడా చెబుతున్నారు. చూడాలి దీని పర్యవశానాలు ఎలా ఉంటాయో.


మరింత సమాచారం తెలుసుకోండి: