ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు గా నలుగురు అభ్యర్థులను ప్రతిపాదించిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన అభ్యర్థుల జాబితా పై అటు ప్రతిపక్ష టీడీపీ మాత్రం తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తోంది ఈ విషయంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఏపీ గవర్నర్ కు లేఖ రాశారు. ఇక ఈ లేఖలో పలు కీలక విషయాలను ప్రస్తావించారు. నీతి నిజాయితీలతో మంచి నడవడిక ఉన్నవారు మాత్రమే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కించుకుంటే బాగుంటుందని..  ఇలాంటి వారినే నియమించాలి అంటూ లేఖలో పేర్కొన్నారు వర్ల రామయ్య.




 అయితే ఇటీవలే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి కోసం ముఖ్యమంత్రి జగన్ ప్రతిపాదించిన నలుగురిలో కూడా ముగ్గురు అభ్యర్థులు నేర చరిత్ర కలిగిన వారి అంటూ చెప్పుకొచ్చారు. 20 ఏళ్ల క్రితం దళిత యువకుడికి శిరోముండనం చేసి దేశవ్యాప్తంగా నేర చరిత్ర కలిగిన వ్యక్తి గా పేరుగాంచిన తోట త్రిమూర్తులునూ సీఎం జగన్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి కోసం ప్రతిపాదించడం దారుణం అంటూ వర్ల రామయ్య వ్యాఖ్యానించారు.  అయితే త్రిమూర్తులు పై  ఇప్పటికి కూడా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో క్రిమినల్ కేసులు ఉన్నాయి అంటూ వ్యాఖ్యానించారు.



 సీఎం జగన్ ప్రతిపాదించిన మరో అభ్యర్థి లేళ్ల అప్పిరెడ్డి పై కూడా ఎంత నేరచరిత్ర ఉందో అందరికీ తెలుసని..  గతంలో గుంటూరులో మిర్చి యార్డు తగలబెట్టిన వారిలో ప్రముఖంగా లేళ్ల అప్పిరెడ్డి పేరు వినిపించింది అంటూ వర్లరామయ్య లేఖలో పేర్కొన్నారు. ఇక జగన్ ప్రతిపాదించిన మూడో అభ్యర్థి రమేష్ యాదవ్ సైతం గతంలో ఒక హత్య కేసులో విచారణ సైతం ఎదుర్కొంటున్నట్లు వర్ల రామయ్య పేర్కొన్నారు. ఇలా ముఖ్యమంత్రి జగన్ ప్రతిపాదించిన నలుగురిలో ముగ్గురు తీవ్రమైన నేరచరిత్ర కలిగిన వారిని  ఇక గవర్నర్ ఎమ్మెల్సీ కోట కింద ప్రతిపాదించిన వారిలో  ఈ ముగ్గురిని తిరస్కరించాలి అంటూ లేఖలో గవర్నర్ను కోరారు వర్ల రామయ్య.

మరింత సమాచారం తెలుసుకోండి: