ఏపీలో టీడీపీ-జనసేన మరోసారి కలిసి పోటీలో దిగేందుకు సిద్ధం అయ్యాయి. ఇప్పటికే సీట్ల విషయంలో ఒక స్పష్టతకు వచ్చినట్టు తెలుస్తుంది. కుల రాజకీయాలు తప్ప ఏమి తెలియని టీడీపీ తో మొదటి నుండి పొత్తులను కొనసాగిస్తున్న జనసేన మరోసారి జతకట్టడం అది కూడా ఈసారి టీడీపీ కి డిపాజిట్లు కూడా రావనే సర్వే లు చూసి కూడా తాను ఈ నిర్ణయం తీసుకోవడం పై ఆ పార్టీలో రకరకాలుగా అనుకుంటున్నారు. గతంలో ఈ రెండు పార్టీలు పోటీచేసినప్పటికీ పెద్దగా ప్రభావం ఏమి చూపలేకపోయాయి. అయినా గెలిచిన వైసీపీ పై బురద జల్లుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే టీడీపీ ఇప్పటికే స్థానిక ఎన్నికలలో కూడా తన నియోజక వర్గాలలోనే కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే.

ఇవన్నీ చేస్తున్నప్పటికీ మరోసారి టీడీపీ తో జనసేన ఏ దైర్యం తో జతకట్టిందో సేనాని కే తెలియాలి. టీపీడీ కి మాత్రం దీనిపై స్పష్టత ఉంది అనే చెప్పాలి. వారి పరిస్థితి మొదటికే మోసం వచ్చిన చందాన ఉంది, దీనితో కాస్త గ్రాఫ్ ఉన్న జనసేనను పక్కన పెట్టుకుంటే వారికీ కలిసొస్తుందనే ఈ పొత్తుకు సిద్ధం అయినట్టు తెలుస్తుంది. టీడీపీకి రానున్న సాధారణ ఎన్నికలలో ఎక్కడైనా డిపాజిట్ వస్తే అది జనసేన పుణ్యం అనే చెప్పాలి. అసలు మాకు కులం తో పనే లేదు అనే జనసేన, కులం తప్ప మరొకటి పట్టించుకోని బాబు హయాంలోని టీడీపీతో జతకట్టడం అందరిని మొదట్లో ఆశ్చర్యపరిచినప్పటికీ, ఇప్పుడు ఈ రెండు పార్టీలు లోపాయకారి ఒప్పందాలు బాహాటంగానే చేసుకుంటున్నాయి.

ఈ పార్టీతో తిరిగి ఒక్కడు కూడా బాగుపడ్డ చరిత్ర లేనప్పటికీ జనసేన మాత్రం దానిని వీడకుండా తోడుగా ఉండటం వెనుక పలు అనుమానాలు వస్తున్నయి. అసలు ఈ పొత్తులు సేన కు ఆసక్తి లేనప్పటికీ, తమ మాటకు విలువలేని ఇవ్వని సేనానికి ఏమని చెప్పగలరు.  మొదట్లో ఈ పార్టీతో జతకట్టినప్పుడే వద్దు అన్నా కూడా వినకుండా అప్పటి నుండి అదే తప్పు చేస్తూనే ఉన్నాడు సేనాని. దీనితో సేన చేసేది లేక భరిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొందరు ఇప్పటికే జనసేన పార్టీ విడిపోతున్నట్టు తెలుస్తుంది. ఇంకా కొందరు ఉన్నారు అంటే అది కేవలం  చిరంజీవి పై అభిమానం, ఆయన ఉండమన్నందుకు సహనం వహిస్తున్నట్టు తెలుస్తుంది. వీళ్లు కొన్నాళ్ళు చూస్తారు, అప్పటికి వినకపోతే ఎవరి  దారి వాళ్ళు చూసుకోవాల్సి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: