సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోతున్నప్పటికీ సులభం అనే మాటకు అర్ధం దిగజారిపోతోంది. అందుకే ఈ తరంలో సులభం అనే మాట బాగా ప్రభావితం చేస్తుంది. ఏదైనా సులభంగా వచ్చేయాలని వాళ్ళ ఆత్రుత. ఇక సాంకేతికత వలన ప్లాస్టిక్ వస్తూ ఉత్పత్తి తీవ్రంగా పెరిగిపోయింది. అలాగే దాని వాడకం కూడా అంతే స్థాయిలో పెరిగింది. వాడకం సులభం కాబట్టే ఆయా వస్తువుల కు అంత డిమాండ్. దానిని గమనించిన ఉత్పత్తి దారులు కొత్త కొత్త ఉత్పత్తులను మార్కెట్ లోకి తెస్తున్నారు. అవి చూడటానికి, వాడటానికి కూడా బాగా ఉండటంతో వినియోగదారులు కూడా అదే స్థాయిలో వాడుతున్నారు. అంతవరకు బాగానే ఉన్నప్పటికీ, దానిని అంత తీవ్రంగా వాడటం వలన దీర్ఘకాలికంగా అనేక వ్యాధుల బారిన పడుతున్నట్టు కనుగొన్నారు వైద్యులు. దీనితో ఆ ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని తగ్గించాలని ఆయా ప్రభుత్వాలు కూడా అనేక చర్యలు తీసుకుంటున్నాయి.

ఇప్పటికే మనిషి జీవితంలోకి చాలా వరకు ఆక్రమించేసిన ఈ ప్లాస్టిక్ రోజువారీ వాడకంలో బాగా పెరిగిపోయింది. దీనితో దానివలన వచ్చే వ్యాధులు కూడా అంతే తీవ్రంగా పెరిగిపోతున్నాయి. కేవలం ఈ ప్లాస్టిక్ వస్తువుల వాడకం వలన దానినుండి విడుదల అయ్యే రసాయనాల వలన ప్రతి ఏటా ఒక్క అమెరికాలోనే దీని బారిన పడి లక్ష మంది మృత్యువాత పడుతున్నారు. తాజాగా నిర్వహించిన ఒక సర్వే లో ప్లాస్టిక్ వస్తువులు వాడుతున్న వారిలో థాలేట్ల గాఢత అనుకున్న దానికంటే తీవ్రంగా ఉంటున్నట్టు పేర్కొన్నారు. వారిలో ఎక్కువ గుండెజబ్బులు కూడా ఉన్నట్టు తెలిపారు. ఈ జబ్బులతో వాళ్ళు చనిపోవటం కూడా జరుగుతుందని సర్వే లో వెల్లడైంది. ఈ రసాయనం మానవుని శరీరంలో ఎక్కువ కాలం ఉంటె అది తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుందని వైద్యులు చెపుతున్నారు.

ప్లాస్టిక్ ఎంత ప్రమాదమో ఒకప్పుడే తెలిసినప్పటికీ దానిని ఇప్పటివరకు నిరోధించడం మాత్రం ప్రపంచ దేశాల తరం కాలేదు. అంతలా అది అన్ని చోట్లకు విస్తరించింది. ఇప్పటికే ప్రమాద స్థాయిలో ఉన్న కొన్ని రకాల ప్లాస్టిక్ వస్తువులను నిషేదించారు. అనడం వరకే తప్ప ముందు కార్యాచరణ సరిగా లేకపోవడం చేత అవేవి సరైన ఫలితాలు ఇవ్వలేకపోతున్నాయి. తాము ఉత్పత్తి చేస్తున్నాము, కొనే వాళ్ళు కొంటారు లేదంటే లేదు అంటూ ఉత్పత్తి దారు మాట్లాడుతుంటే, మాములు వస్తువు 50రూ. దొరుకుతుంటే, ప్లాస్టిక్ వస్తువు 5రూ. మాత్రమే దొరుకుతుండటంతో దానిని వాడటానికి ఎక్కవుగా మంది ఉత్సాహం చూపిస్తున్నారు. కనీసం ప్రభుత్వాలు ప్లాస్టిక్ కిరానా బాగ్ లను కూడా నిషేదించడంలో సఫలం కాలేకపోతున్నారు. అయితే తరువాతి తరం అంతా ప్లాస్టిక్ రసాయనాలకు బలిపశువులు కాకతప్పదేమో!

మరింత సమాచారం తెలుసుకోండి: