బూతులకు వైసీపీనే యూనివర్శిటీ అన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. చంద్రబాబును.. ప్రతిపక్ష నేతలను.. ఉద్యోగులను బూతులు తిట్టిన వారినేం చేశారు..? కేసులెందుకు పెట్టలేదు అని నిలదీశారు ఆయన. గిద్దలూరులో ఎమ్మెల్యేని నిలదీసినందుకు దళిత యువకుడ్ని చంపేశారు అని మండిపడ్డారు. ఏపీలో ఎమర్జెన్సీ ప్రకటించాలి అని ఆయన కోరారు. పార్టీ కార్యాలయంపై దాడి చేసి తలలు పగల కొడితే హత్యాయత్నం కేసు పెట్టారు అని మండిపడ్డారు. కానీ సీఐను జాగ్రత్తగా అప్పగిస్తే హత్యాయత్నం కేసా..? అని ఆయన ప్రశ్నించారు.

తమ అధినేత చంద్రబాబుకు ఓపిక ఎక్కువ.. తాను అలా కాదు.. వడ్డీతో సహా చెల్లిస్తాం అంటూనే దేశంలో ఎక్కడున్నా వదిలిపెట్టం అని ఆయన తీవ్ర స్వరంతో హెచ్చరించారు. పార్టీ కార్యాలయంపై దాడి కాదు.. దేవాలయంపై దాడి చేశారు అని ఆయన విమర్శలు చేసారు. అధికారులే మఫ్టీలో వచ్చి దేవాలయంపై దాడులు చేస్తున్నారు అని లోకేష్ అన్నారు. డీఎస్పీ దాడి చేసిన వాళ్ళను  దగ్గరుండి కార్లు లో పంపారు అని అన్నారు. దాడి చేసిన వాళ్ళు డీజీపీ ఆఫీస్ ముందు నుండి వచ్చి,   అటే తిరిగి వెళ్లారు అని లోకేష్ ఆరోపణలు చేసారు.

ఆయన డీజీపీ గా ఇది చూశాక కూడా ఫిట్ అని ఎలా అంటామన్నారు లోకేష్. ఆఫ్ఘనిస్తాన్ లో డ్రగ్స్ తాలిబన్ లు తయారు చేస్తే ,  ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అని విమర్శలు చేసారు. నేను నిన్న సాయంత్రం 6.30 కు ఇక్కడ లేను హైదరాబాద్ లో ఉన్న నేను ఇక్కడ ఉన్నట్టు  నా పై అట్టెంప్ట్ టూ మర్డర్ అంటూ దొంగ కేస్ పెట్టారు అని విమర్శించారు. ప్రజల తరపున పోరాడి నేను ఏ1, దేశాన్ని దోచేసిన కేస్ లో నేను ఏ 1 కాదు అన్నారు. రెండున్నర ఏళ్ళు అయింది మీరు అధికారం లోకి వచ్చి . నా పై ఒక్క ఆరోపణ కూడా నిరూపించలేదు అని ఆరోపణలు చేసారు. పార్టీ ఆఫీస్ కు సెంట్రల్ ఫోర్స్ ఇస్తామని అమిత్ షా చెప్పారు అని అన్నారు లోకేష్.తాను డ్రగ్స్ టెస్ట్ కు సిద్దంగా ఉన్నాను అని వైసీపీ వాళ్ళు తేదీ చెప్పాలని లోకేష్ డిమాండ్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: