చంద్రబాబుకు వయసు పెరిగే కొద్ది...ఎలాంటి వ్యూహాలు పన్నుతున్నారో అర్ధం కాకుండా ఉంది. ఒకప్పుడు చంద్రబాబు వ్యూహాలు చూసి...రాజకీయ చాణక్యుడు అని అంతా అనుకునే వారు. మరి ఆ చాణక్యం ఏమైందో ఎవరికి తెలియడం లేదు. బాబు కూడా సర్వమంగళ మేళం మాదిరి తయారైపోయారు. ఏదో ప్రతిపక్షంలో ఉన్న కాబట్టి...అధికారంలో ఉన్న జగన్‌ని విమర్శించాలనే కోణంలోనే ఉండిపోయారు.

ఎలా పడితే అలా...తమ నేతల చేత మాట్లాడించేస్తున్నారు. ఇక ఆ పట్టాభి గురించి చెప్పాల్సిన పని లేదు. సబ్జెక్ట్ పరంగా విమర్శలు చేస్తే ఎవరైనా రిసీవ్ చేసుకుంటారు. అలా కాకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టు విమర్శలు చేస్తే....ఇలాంటి రచ్చే జరుగుతుంది. ఒకవేళ పట్టాభి...సి‌ఎం జగన్‌ని తిట్టకపోయి ఉంటే, నేడు రాష్ట్రంలో ఇంత రచ్చ జరిగేది కాదు. ఇక వైసీపీ వాళ్ళకు ఎలాగో టెంపర్ ఎక్కువ. వారి బూతులు ఎలా ఉంటాయో తెలియనిది కాదు. పైగా అధికారంలో ఉండటంతో డైరక్ట్‌గా దాడులు చేసేవరకు వచ్చేశారు.


అయితే వైసీపీ వాళ్ళని ఇంతవరకు తీసుకొచ్చింది చంద్రబాబే...పట్టాభి చేత రెచ్చగొట్టించకుండా ఉంటే..ఈ రచ్చ జరిగేది కాదు. ఆఫీసులపై దాడులు జరిగేవి కావు. ఇలా తమ నాయకుల చేత రెచ్చగొట్టిస్తే...ఆటోమేటిక్‌గా జగన్‌కే బెనిఫిట్ అవుతుంది. పట్టాభి లాంటి నాయకుల వల్ల జగన్‌కే ప్లస్ అవుతుంది గానీ, చంద్రబాబుకు పావలా ఉపయోగం లేదు. అయితే పట్టాభి లాంటి నాయకులు ఇంకా ఉన్నారు. వారిని కాస్త కంట్రోల్ చేయకపోతే బాబుకే బొక్క.
అలాగే ముందుగా భజన చేసే నాయకులని పక్కనబెట్టాల్సిన అవసరముంది. జగన్‌ని తిడుతూ....తనకు భజన చేసే నేతలని బాబు బాగా ఎంకరేజ్ చేస్తారు. అలాంటి వారిని సైడ్ చేయకపోతే టి‌డి‌పికే నష్టం. అలాంటి నాయకులు వల్లే గత ఎన్నికల్లో జగన్‌కు భారీ మెజారిటీ వచ్చింది. అదే కంటిన్యూ అయితే...మళ్ళీ జగనే సి‌ఎం అవుతారు. అందులో ఎలాంటి అనుమానం లేదు. టి‌డి‌పి నేతలే దగ్గరుండి జగన్‌ని సి‌ఎం చేస్తారు.  



మరింత సమాచారం తెలుసుకోండి:

tdp