ఏపీలో యాగీ చేయడానికి తప్ప మరో పని చేయలేని స్థితిలోకి ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన టీడీపీ ఉంది. ఈ స్థితిలో కూడా కేంద్రమంత్రి అమిత్ షా తో మాట్లాడాము అంటూ అబద్దపు ప్రచారాలు చేసింది. ఆయన అన్నిటికి హామీ ఇచ్చారు అంటూ లేనిపోని విషయాలు ప్రస్తావించింది. ఇక బాబొరి దొంగ దీక్ష అయ్యాక కూడా ఆయన కు కేంద్ర మంత్రి అపాయింట్మెంట్ దొరికింది అంటూ ఢిల్లీ బయలుదేరినట్టు నాటకాలు ఆడారు. అయినా అంతలేకపోయేసరికి పరువు నిలబెట్టుకోవడం కోసం కేవలం ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి గారికి వినతి పత్రం ఇస్తారు అంటూ చెప్పుకుంటున్నారు టీడీపీ వర్గాలు. అంతటితో ఆగకుండా తాము చెప్పిన అబద్దపు ప్రచారాలు నిజం అని నిరూపించుకోవడానికి, లేదా మద్దతుగా ప్రధాని, కేంద్రమంత్రి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించడానికి అంటూ కొత్త నాటకం మొదలుపెట్టారు.

బాబోరు అండ్ టీం అంటేనే ఒక్కనాడు సరిగ్గా నిజం మాట్లాడారు అనేది మరోసారి రుజువుఅయిపోయింది. ఇదంతా ఆయన ఎందుకు చేస్తున్నది ఆమాత్రం కేంద్రానికి తెలియదా. వాళ్ళ అనుభవంలో ఎన్ని చూసి ఉంటారు. అవన్నీ మరిచిపోయి, జనాలను మళ్ళీ పిచ్చోళ్లను చేయడానికి ఆయన చేసిన కృషి, పట్టుదల అబ్బో అవన్నీ బాబోరికి మాత్రమే చెల్లుతాయి. ఆయన దీక్ష చేయగానే పాపం అదేదో పొట్టి శ్రీరాములు చేసినట్టుగా లేదా గాంధీ మహాత్ముడు చేసినట్టుగా భావించి అందరూ ఆయన దీక్షాస్థలికి వెళ్లి పలకరించి, ఇంత నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమించండి బాబోరు అంటూ బ్రతిమిలాడతారు అనే భ్రమలో ఇంకా ఉన్నారంటే ఎంత అమాయకత్వం నటించేస్తున్నారు.  

ఇవన్నీ కేవలం ఉపఎన్నిక ఎత్తుగడలు, వ్యూహాలు అని చూసేవారందరికి తెలిసిందే. కానీ దీనికే అనుకూల మీడియా రాసేసింది, ఏమంటే, బాబోరు దీక్ష కు కూర్చోగానే టీడీపీకి కొండంత బలం వచ్చిందని, వచ్చిందో రాలేదో ఆ దీక్షా స్థలిని చూస్తేనే అర్ధం అవుతుంది. ఇవన్నీ వాళ్ళ మీడియాలో కాబట్టి సరిపోయింది, ఇంకా బీబీసీ లో కూడా వచ్చిందని ప్రచారం చేసుకున్నారు కాదు. ఇంత నాటకాలు ఆడకపోతే గతంలో ప్రజలు నమ్మి అవకాశం ఇంచినప్పుడే సరిగ్గా దానిని నిలబెట్టుకునే విధంగా పాలన చేసి ఉంటె సరిపోవును కదా. ఆహా, అవన్నీ చేయం, కానీ అడిగినప్పుడల్లా అధికారం మాత్రం కావాల్సిందే. ఇది వీళ్ళ దిక్కుమాలిన రాజకీయాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: