ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం పేదలకు భారీగా ఇళ్లను ఇచ్చే కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. అయితే అది ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా వివిధ కోర్టు కేసులతో ఆగిపోయింది. ఇంతకీ ఆపేయమననడానికి కోర్టుకు దొరికిన కారణం, పర్యావరణ హితంగా లేదట. అంటే పుష్కలంగా గాలి, వెలుతురూ, చుట్టూ చెట్లు ఉండాలట. అంత గొప్ప వెసులుబాటు పెద్దోళ్ల ఇళ్లలోనే లేవు, ఇక మధ్యతరగతి వాళ్ళు కొనుక్కునే అపార్ట్మెంట్ల్స్ లో అసలే ఉండవు. వీటన్నికి అడ్డం కానీ పర్యావరణం, పేదల ఇళ్లకు మాత్రం ఎలా అడ్డువచ్చిందో పైవాడికే ఎరుక. ఏది ఏమైనా ఇలాంటి తీర్పు ను కొట్టేస్తూ, తాజాగా ఈ అడ్డంకులు తొలగించింది ఉన్నత న్యాయస్థానం. తద్వారా పేదల ఇళ్లకు ఇప్పటి వరకు ఉన్న అడ్డంకులు తొలగిపోయినట్టే.

అయితే ఇక అంతా ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో ఇళ్లను కట్టి ఇస్తాం అని స్పష్టం చేసింది. అంటే ఇక ప్రభుత్వం త్వరితగతిన ఇళ్లను కట్టి పేదవాళ్లకు అప్పగించాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు పేదోళ్ల భూములకు కేసులు అడ్డుకాగా ఇకమీదట ప్రభుత్వ అలసత్వం అడ్డుకాకూడదు. నిధులు లేవనో మరొకటి లేవనో ఈ పధకాన్ని అమలు చేయలేకపోతే తరువాత ఎన్నికలలో ప్రతిపక్షానికి దొరికిపోయి అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం ద్వారా, కొంత మేర తయారైన నెగటివ్ ఓట్లను వారు తన్నుకుపోవడానికి ప్రయత్నిస్తున్నారు. అలా జరిగితే ప్రమాదం తప్పదు.

గతంలో ఇళ్ల స్థలాలను ఇవ్వాలని చూసినప్పటికీ, కట్టి ఇద్దామని ప్రభుత్వం భావించడంతో పూర్తిస్థాయికి ఈ కట్టడం అవ్వాలంటే కాస్త సమయం పెట్టె అవకాశాలు ఉన్నాయి. అది ఎన్నికల లోగా జరిగిపోవాల్సి ఉంటుంది. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటేనే మంచిది. అయితే దశలవారీగా ఈ పని పూర్తి చేయాలని గతంలో భావించినప్పటికీ, అన్ని దశల వరకు ఎన్నికలు ఆగే పరిస్థితి లేనందున ప్రభుత్వం జాగర్త పడాల్సి ఉంటుంది.  కనీసం ఇళ్ల స్థలాలను లబ్దిదారులకు ఇచ్చే కార్యక్రమం పూర్తిచేస్తే కొత్త మేలు జరిగినట్టే. కట్టడం ఎప్పుడు ప్రారంభిస్తారు, ఎప్పుడు ముగిస్తారు అనేది ప్రతి లబ్ధిదారుడికి స్పష్టంగా చెప్పడం, ఆయా తేదీలను ఖచ్చితంగా అనుసరించడం కూడా ముఖ్యం.

మరింత సమాచారం తెలుసుకోండి: