తెలుగుదేశం పార్టీ నుంచి ఎప్పుడు ఎవరు బయటకు వెళ్తారు అనేది చంద్రబాబు నాయుడు కి అర్థం కావడం లేదు. తెలుగుదేశం పార్టీలో ఉన్న చాలామంది నాయకులు ఈ మధ్యకాలంలో దూకుడుగా ముందుకు వెళ్లలేక పోవడం రాజకీయంగా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేందుకు గట్టిగా ప్రయత్నాలు చేయకపోవడం వంటివి ఆ పార్టీ అధిష్టానాన్ని అన్ని విధాలుగా కూడా ఇబ్బంది పెడుతున్న అంశాలుగా చెప్పాలి. పార్టీలో ఉన్న కొంతమంది కీలక నాయకులు ఈ మధ్యకాలంలో పార్టీ మారేందుకు కాస్త గట్టిగా ప్రయత్నం చేయడమే కాకుండా భారతీయ జనతా పార్టీతో జాతీయ స్థాయిలో చర్చలు జరుపుతున్నారని వార్తలు వినపడుతున్నాయి.

తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది కీలక నాయకులు ఈ మధ్య కాలంలో ఢిల్లీలో ఎక్కువగా ఉంటున్నారని ఒక ఎంపీ కేంద్ర మంత్రి తో ఎక్కువగా చర్చలు జరుపుతున్నారని ప్రచారం జరుగుతోంది. కేంద్ర మంత్రి తో మాట్లాడటమే కాకుండా పార్టీ మారేందుకు అన్ని విధాలుగా కూడా ప్రయత్నం చేస్తున్నారని త్వరలోనే ఆయన పార్టీ మారే అవకాశాలు కూడా ఉండొచ్చని పార్టీ మారిన సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు.

పార్లమెంట్ సమావేశాలు కూడా సదరు ఎంపీ పెద్దగా హాజరుకాకపోవడం అదే విధంగా భారతీయ జనతా పార్టీ నాయకులతో కలిసి వ్యక్తిగత కార్యక్రమాలకు హాజరు కావడం వంటివి జరుగుతున్నాయి.అధికార పార్టీ ఆ విషయంలో కాస్త సీరియస్ గా ఉన్న సదరు ఎంపీ గారు చంద్రబాబు నాయుడు నుంచి ఎటువంటి సహకారం లేకపోవడంతోనే పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారని ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో కాస్త గట్టిగా చర్చలు జరిపారని అంటున్నారు. అయితే ఆయన పార్టీ మారతారా లేదా అనే దానికి సంబంధించి స్పష్టత లేకపోయినా కొంతమంది కీలక బిజెపి నాయకులు మాత్రం ఆయనకు సంబంధించిన నివేదికను కేంద్ర నాయకత్వానికి పంపించారని ఆయన ఖచ్చితంగా గెలుస్తారు అని చెప్పారని అంటున్నారు.త్వరలో దీనిపై ఒక క్లారిటీ రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp