తాలిబన్ల  పరిస్థితి రోజురోజుకు అధ్వానంగా మారిపోతుంది.. మునుపెన్నడూ చూడని విధంగా సరికొత్త పాలన అందిస్తామని చెప్పిన తాలిబన్లు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ప్రజలందరినీ కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మహిళలకు సముచిత గౌరవం కల్పిస్తామంటూ చెప్పిన తాలిబన్లు ఇప్పుడు మాత్రం మహిళలను బానిసలుగా మార్చుకున్నారు.. కనీసం చదువుకోవడానికి వీలులేదని దూరప్రయాణాలు చేయడానికి వీల్లేదని అంతే కాకుండా కనీసం ఉద్యోగాలు చేయడానికి కూడా వీలు లేదు అంటూ తాలిబన్లు దారుణమైన ఆంక్షలను విధించారు. ఇలా ప్రపంచం మొత్తం ప్రజాస్వామ్య పాలన సాగుతున్న తరుణంలో ఆఫ్ఘనిస్తాన్లో మాత్రం  ఇస్లామిక్ పాలన సాగిస్తూ దారుణంగా వ్యవహరిస్తూ ఉండటం గమనార్హం.


 ఇలాంటి సమయంలోనే తాలిబన్ల ప్రభుత్వాన్ని అటు ప్రపంచ దేశాలు అంగీకరించే పరిస్థితుల్లో లేవు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాలిబన్ ప్రభుత్వం ఇలా  ఏర్పడిందో లేదో అటు ప్రపంచ దేశాలు తాలిబన్లతో ఉన్న అన్ని రకాల సమస్యలను తెంచుకున్నారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో అటు ఆఫ్ఘనిస్తాన్లో తీవ్రస్థాయిలో ఆర్థిక సంక్షోభం ఆహార సంక్షోభం ఏర్పడుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఒక వైపు ఆఫ్ఘనిస్తాన్ దేశంలోని ప్రజలందరూ తీవ్ర స్థాయిలో ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న నేపథ్యంలో భారత్ నుంచి వచ్చిన గోధుమలను పంపిణీ చేస్తూ ఇక ఆయా గోధుమలను సంక్షేమ పథకాలు గా భావించాలి అంటూ సూచిస్తున్న విషయం బయటికి వచ్చింది. అదే సమయంలో మరోవైపు ఆర్థిక సంక్షోభం ఏర్పడుతున్న నేపథ్యంలో ఇతర దేశాల నుంచి సహాయం కోరుతూ లేకుండా తాలిబన్లు అడుక్కునే పరిస్థితి ఏర్పడింది.



 ఇటీవల చిన్న దేశమైన ఏవిధంగా నార్వే కూడా ఆర్థిక సాయం చేయాలంటూ తాలిబన్ల ప్రభుత్వం   కోరడం గమనార్హం. ఇప్పటికే ముస్లిం దేశాలు అయినా తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తించాలి అంటూ కోరిన తాలిబన్లు ఇక ఇప్పుడు ఏకంగా నార్వో దేశాన్ని మానవతా దృక్పథంతో సహాయం చేయాలని అంటూ కోరింది.. ఇలా ఏకంగా అగ్రదేశాలు గా కొనసాగుతున్న దేశాలనే కాదు చిన్నిదేశాలను కూడా ఆర్థిక సహాయం చేయాలంటూ వేడుకుంటూ ఉండడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: