రాజకీయాల్లో ఏ నాయకుడైన లాభం లేకుండా ఏ పనిచేయరనే చెప్పాలి. ప్రజలకు ఏమన్నా చేస్తే...ప్రజల నుంచి తమకు తిరిగి ఏం వస్తుందనే కోణం నాయకులకు ఉంటుంది. గతంలో అంటే నాయకులు ప్రజల బాగోగుల కోసం పనిచేసేవారు...కానీ ఇప్పుడు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు. ప్రతి పనికి ఓట్లు ఎలా పడతాయనే కోణం నాయకుల్లో ఉంటుంది. అధికారంలో ఉండే ప్రతి పార్టీ కూడా రాజకీయ లబ్ది పొందడానికే పనిచేస్తూ ఉంటుంది.

గతంలో టీడీపీ కావొచ్చు...ఇప్పుడు వైసీపీ కావొచ్చు..రాజకీయంగా లబ్ది లేకుండా ఏ పనిచేయరు. ఏదో మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారంటే...ఇది కేవలం ప్రజల కోసమే అని చెప్పడానికి లేదు..దీని ద్వారా రాజకీయంగా లబ్ది పొందాలని ప్లాన్ చేశారని అందరికీ అర్ధమైంది. ఇప్పుడు జగన్ ప్రభుత్వం జిల్లాల విభజన చేసింది...మరి ప్రజల కోసం, అభివృద్ధి కోసమే జిల్లాల విభజన చేశారా? అంటే జనం చెవులో పువ్వులు పెట్టుకోలేదనే చెప్పొచ్చు. ఇందులో కూడా ఏదో రాజకీయ లబ్ది లేకుండా ఉండదు. అది నిదానంగా అందరికీ అర్ధమవుతుంది.

ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న ఇతర సమస్యలని డైవర్ట్ చేయడానికే జిల్లాల విభజనని తెరపైకి తీసుకొచ్చారనే విమర్శలు వస్తున్నాయి..ఇందులో వాస్తవం లేకుండా పోలేదు...ఇప్పుడు జనమంతా ఇతర సమస్యలని వదిలేసి..కేవలం జిల్లాల విభజన గురించే మాట్లాడుకుంటున్నారు. ఇదే కాకుండా జిల్లాల వారీగా రాజకీయంగా లబ్ది పొందేందుకు కూడా స్కెచ్ వేసి ఉంటారని అర్ధమవుతుంది.

అయితే అక్కడక్కడ టీడీపీకి కూడా బెనిఫిట్ ఉంటుందని చెప్పొచ్చు. ఇప్పుడు కొత్తగా ఆరు స్థానాలతో బాపట్ల జిల్లా ఏర్పడింది. రేపల్లె, వేమూరు, బాపట్ల, పర్చూరు, అద్దంకి, చీరాల స్థానాలతో జిల్లా ఏర్పడింది. బాపట్ల పార్లమెంట్‌లో ఉండే సంతనూతలపాడు స్థానాన్ని ప్రకాశం జిల్లాలో కలిపారు. దీంతో బాపట్ల జిల్లాలో ఆరు స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఈ ఆరు స్థానాల్లో టీడీపీ నాలుగు గెలిచింది...అలాగే ఇప్పుడు మిగిలిన స్థానాలపై కూడా టీడీపీ పట్టు సాధిస్తుంది. ఓవరాల్‌గా జిల్లాలో టీడీపీకి లీడింగ్ స్పష్టంగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: