
నరేంద్ర మోదీపై అనసవరంగా విమర్శలు చేయడం వల్ల టీడీపీకి ప్రస్తుతం ఒనగూరేది ఏమీ లేదు. కావాలని రెచ్చగొట్టేందుకు సతీష్ చాగంటి ప్రయత్నాలు చేస్తున్నారంటున్నారు. 2014 నుంచి 2019 వరకు సతీష్ చాగంటి చాలా విషయాలు మాట్లాడారు. ఇది టీడీపీ దారుణంగా దెబ్బతినడానికి కారణమయ్యారని తెలుస్తోంది. ఈయన దెబ్బతో 23 సీట్లకు పడిపోయారంటారు.
చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీ 20 ఎంపీ స్థానాలు గెలిచి బీజేపీ కేంద్రంలో 230 గెలిస్తే ఈ 20 స్థానాలతో బీజేపీలో ప్రధాని ఎవరనేది చంద్రబాబు నిర్ణయిస్తారని, అప్పుడు కేంద్రంలో మోదీ, షా లు కాకుండా నితిన్ గడ్కరీని ప్రధాని పదవికి సూచిస్తాడని వారు భయపడుతున్నారని టీడీపీ నేత సతీష్ చాగంటి చెబుతున్నారు. ఒకప్పటి బీజేపీలా చంద్రబాబు మీద ఆధారపడి ఉన్నదని సతీష్ చాగంటి అనుకుంటున్నారు. కానీ దేశంలో బలమైన శక్తిగా ఎదిగిన బీజేపీ అని ఆయన మరిచిపోతున్నారు.
అందుకే బీజేపీని ఎదిరించిన చంద్రబాబు ప్రస్తుతం అరెస్టయి జైల్లో ఉన్నా కూడా ఏ మాత్రం బీజేపీ నేతలు పట్టించుకోవడం లేదు. ఇప్పుడిప్పుడే కాస్త సింపథీ చూపిస్తుంటే అది కూడా లేకుండా చేయాలని టీడీపీ నేత సతీష్ చాగంటి మాటలు ఉంటున్నాయన్న వాదన వినిపిస్తోంది. కాబట్టి బీజేపీతో పొత్తు అనేది కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎక్కువగా నిధులు తీసుకు వచ్చేందుకు ఉపయోగపడతాయి. అంతే కాకుండా వివిధ అంశాల్లో రాష్ట్రం కేంద్రం కలిసి పని చేస్తే అది రాష్టానికి ఉపయోగపడుతుంది.