ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన నేతల పనితీరు బాగానే ఉన్నా కొందరు ఎమ్మెల్యేల పనితీరు ఏ మాత్రం బాలేదని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అధికారంలోకి రాకముందు కార్యకర్తలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలను పూర్తిస్థాయిలో విస్మరిస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే ఎమ్మెల్యేల పనితీరు గురించి ఈనాడులో ప్రచురితమైన కథనం సంచలనం అవుతోంది.

"తెలుసా.. కార్యకర్తల మనసు" అనే శీర్షికతో  అరాచక ఎమ్మెల్యేల విషయంలో చర్యలు తీసుకోవాల్సిందే అని ఆలా చేయని పక్షంలో పార్టీకి తీరని నష్టం కలుగుతుందని షాకింగ్ రిపోర్ట్ వెల్లడైంది.  కష్ట కాలంలో పార్టీకి అండగా నిలబడిన కార్యకర్తలకు నేతలు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని అలా  చేయని పక్షంలో పార్టీ తీవ్రస్థాయిలో నష్టపోక తప్పదని కామెంట్లు వ్యక్తమయ్యాయి.   గత ప్రభుత్వంలో నేతలు చేసిన తప్పులే ఇప్పుడు కూడా  రిపీట్ అవుతున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.

అర్హత ఉన్న కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు ఇవ్వడం, పార్టీలో తగిన ప్రాధాన్యత కల్పించడం ద్వారా  వాళ్లకు న్యాయం జరిగినట్లు అవుతుంది.  గత ప్రభుత్వ పాలనలో టీడీపీ  కార్యకర్తలు ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. వాటికి ఎదురొడ్డి కష్టపడిన నేతలకు  న్యాయం చేయాల్సిన బాధ్యత  కూటమి సర్కార్ పై, ఎమ్మెల్యేలపై ఉంది.  తిరువూరు నియోజకవర్గంలో కార్యకర్తలకు తగిన న్యాయం జరగడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

కార్యకర్తలకు అందుబాటులో లేని నేతల విషయంలో  సైతం కూటమి సర్కార్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.   కొందరు నేతలు కార్యకర్తలకు పనులు ఇచ్చినా కమిషన్లు  డిమాండ్ చేస్తున్నారని సమాచారం. చంద్రబాబు ఎంత చెబుతున్న కొందరు నేతలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు.  అసత్య ఆరోపణలను తిప్పికొట్టే విషయంలో సైతం కొందరు నేతలు ఫెయిలవుతున్నారు.  జ్యోతి, ఈనాడు పత్రికలూ కూటమి నేతలు చేస్తున్న తప్పులను ఎత్తిచూపుతున్నాయి. ఈ విషయాలపై చంద్రబాబు నాయుడు సైతం ద్రుష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: