
వైసీపీ ప్రచారం వెనుక కుట్ర ఉందని చంద్రబాబు హెచ్చరించారు. పొన్నూరు, కొండవీటివాగు, ప్రకాశం బ్యారేజ్ వంటి అంశాలపై తప్పుడు వార్తలు రాస్తూ ప్రజల్లో భయం కలిగిస్తున్నారని తెలిపారు. ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంలో టీడీపీ నాయకులు చొరవ చూపాలని, ప్రజలకు నిజాలు చెప్పాలని కోరారు. ప్రభుత్వ విజయాలను, వైసీపీ దుర్మార్గాలను ప్రజలకు వివరించాలని సూచించారు. రాజకీయ ముసుగులో రౌడీలను కట్టడి చేయడంలో కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని చంద్రబాబు నాయకులకు ఆదేశించారు.
నాయకులు ఎప్పటికీ ప్రజలతోనే ఉండాలని, వారి మాటలు, చేష్టలు ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ఉండకూడదని సూచించారు. వివాదాలకు ఆస్కారం ఇవ్వొద్దని హెచ్చరించారు. కష్టపడే కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు ఇస్తున్నామని, త్వరలో ఇతర పదవుల భర్తీ కూడా చేపడతామని తెలిపారు.పార్టీ కమిటీల నియామకాన్ని ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ప్రజా సమస్యలను పరిష్కరిస్తే ప్రతి ఎన్నికలో విజయం సాధ్యమని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఒకటై, వైసీపీ దుష్ప్రచారాన్ని ఎదుర్కొని, ప్రభుత్వ విజయాలను ప్రజలకు చేరవేయాలని పిలుపునిచ్చారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు