పాకిస్తాన్ ఎన్ని కుతంత్రాలు చేసినా అమెరికా ఆదేశానికి సహాయం చేస్తూనే ఉన్నది.  అప్పుగా కోట్లాది డాలర్లు ఇస్తూనే ఉన్నది.  అయితే, ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చే డబ్బుపై నియంత్రణ తీసుకొచ్చాడు.  రుణంగా ఇవ్వాల్సిన మొత్తంలోనుంచి కోట పెడుతూ వస్తున్నాడు.  ఆ దేశానికిచ్చే ఆర్థిక సాయంలో 440 మిలియన్‌ డాలర్ల కోత విధించింది. పాక్‌కు ఇస్తామన్న దాంట్లో ఇక 4.1 బిలియన్‌ డాలర్లు మాత్రమే ఆర్థిక సాయం చేస్తామని ట్రంప్‌ సర్కార్‌ స్పష్టం చేసింది. 


గతంలో కూడా ట్రంప్ సర్కార్ ఈ కోతను విధించింది.  ఉగ్రవాద నిరోధానికి అమెరికా పెంటగాన్ సంస్థ పాక్ కు సాయం చేస్తూ వస్తున్నది.  ఉగ్రవాదంపై ఎలాంటి చర్యలు తీసుకోకపోతుండటంతో.. పెంటగాన్ ఇచ్చే దాంట్లో నుంచి కోత విధించిన సంగతి తెలిసిందే.  ఉగ్రవాదంపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ గతేడాది జనవరిలో పెంటగాన్‌ తామిచ్చే ఆర్థికసాయంలో 1 బిలియన్‌ డాలర్ల కోత విధించింది. అదే ఏడాది సెప్టెంబరులో మరో 300 మిలియన్‌ డాలర్ల సైనిక సాయాన్ని కూడా తగ్గించింది.


ఇలా అమెరికా వరసగా ఇచ్చే సాయంలో కోతలు పెడుతుండటంతో పాకిస్తాన్ ఆర్ధికంగా అనేక సమస్యలను ఎదుర్కొంటోంది.  అమెరికా వంటిది దేశాలు ఇస్తున్న డబ్బుతో పాకిస్తాన్ ఉగ్రవాద నిరోధక చర్యలు తీసుకోకపోగా, ఇండియాపై ఉగ్రవాదులకు ఊతం కల్పిస్తోంది.  ఉగ్రవాదులను రెచ్చగొడుతూ.. ఇండియాపై పోరాటం చేసే జీహాద్ ఉగ్రవాదులకు సాయం చేస్తూ వస్తున్నది.  ఇది ఆ దేశానికి మాయని మచ్చగా పేర్కొనవచ్చు. 


ఇప్పుడు అమెరికా ఇస్తున్న ఆర్ధిక సహాయంతో కోతలు పెడుతుండంతో ఆదాయ మార్గాల కోసం పాకిస్తాన్ అనేక దార్లు వెతుక్కుంటోంది.  ఇప్పటికైనా పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలను పక్కన పెట్టకపోతే.. ఆ దేశం ఆర్ధికంగా మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దేశం ఇప్పటికే ఆర్ధికంగా వెనకబడి ఉన్నది.  ప్రోత్సాహకాలు లేవు.  ప్రజలు కూడా ఆ దేశంపై గిర్రున చూస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: