ప్రస్తుతం భారత క్రికెట్ లో రవీంద్ర జడేజా ఎంత కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం భారత జట్టులో 3 ఫార్మాట్లలో కూడా అద్భుతంగా రాణిస్తూ టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాట్స్మెన్ లను తికమక పెడుతూ వికెట్లు తీసుకున్న రవీంద్ర జడేజా.. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రతిసారి బ్యాటింగ్ తో మెరుస్తూ అద్భుతంగా రాణిస్తున్నాడు అని చెప్పాలి. ఇలా ఒకప్పుడు పేలవమైన ప్రదర్శనతో  జట్టులో స్థానం కోల్పోయిన రవీంద్ర జడేజా ఇప్పుడు మాత్రం అద్భుతంగా రాణిస్తూ  అదరగొడుతున్నాడు.


 ఇక మ్యాచ్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో రవీంద్ర జడేజా బ్యాటింగ్ కు వచ్చాడు అంటే ఏదో అద్భుతాన్ని సృష్టించే పోతాడు అని ప్రేక్షకులు అందరూ భావిస్తూ వుంటారు. అంతలా తన ఆటతో ప్రభావితం చేసాడు రవీంద్ర జడేజా. ఇక భారత క్రికెట్లో 3 ఫార్మాట్లలో కూడా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న ఈ స్టార్ ఆల్ రౌండర్ అటు ఐపీఎల్ లో కూడా అదరగొడుతున్నాడు అని చెప్పాలి. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ధోని ప్రియ శిష్యుడిగా కొనసాగుతున్నాడు రవీంద్ర జడేజా.  ఒకరకంగా చెన్నై జట్టు విజయంలో కీలకపాత్ర వహిస్తున్నాడు అని చెప్పాలి.


 ప్రస్తుతం స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న రవీంద్ర జడేజాపై ఒకప్పుడు బీసీసీఐ నిషేధం విధించిన విషయం చాలామందికి తెలియదు.. ఐపీఎల్ 2010 సీజన్ సమయంలో రవీంద్ర జడేజాపై బీసీసీఐ నిషేధం విధించింది. దీనికి గల కారణం అతని ప్రవర్తన కావడం గమనార్హం. అసలేం జరిగిందంటే.. రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడాల్సిన రవీంద్ర జడేజా రెన్యువల్ ఒప్పందంపై సంతకం చేయకుండా ముంబైతో పాటు మరో రెండు జట్లతో ఎక్కువ డబ్బు వస్తుంది అన్న కారణం తో చర్చలు జరిపాడు. ఈ విషయంపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. క్రమశిక్షణ ఉల్లంఘన చర్యల్లో భాగంగా రవీంద్ర జడేజా పై ఒక సీజన్ పాటు నిషేధం విధించింది బిసీసీఐ.

మరింత సమాచారం తెలుసుకోండి: