
దీనికి కారణం ఇటీవలే ఆదివారం జరగవలసిన ఫైనల్ మ్యాచ్ రద్దు అయిన సమయంలో అక్కడ స్క్రీన్ పై కనిపించిన ఫోటోనే. ఇంకా మ్యాచ్ జరగనే లేదు అప్పుడే విన్నర్ ఎవరు రన్నరఫ్ ఎవరు అన్న విషయాన్ని ఆ స్క్రీన్ పై చూపించారు. ఆదివారం రోజున మ్యాచ్ జరగాల్సి ఉన్నప్పటికీ ఇక వర్షం కారణంగా మ్యాచ్ రద్దయింది. అయితే ఎంతకీ మ్యాచ్ నిర్వహించేందుకు అవకాశం లేకపోవడంతో ఇక మ్యాచ్ ను పోస్ట్ ఫోన్ చేసిన ఎంపైర్లు రిజర్వ్ డే అయిన సోమవారం రోజున సాయంత్రం ఏడున్నర గంటలకు మ్యాచ్ నిర్వహించాలని నిర్ణయించారు. ఇలా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగకముందే మ్యాచ్ ఫిక్స్ అయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
అంతేకాదు ఒక ఆసక్తికర ఫోటో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. మ్యాచ్ జరిగే నరేంద్ర మోడీ స్టేడియంలో బిగ్ స్క్రీన్ పై రన్నరఫ్ చెన్నై సూపర్ కింగ్స్ అనే ఒక ఫోటోని ప్రదర్శించారు. దీంతో ఫైనల్ గుజరాత్ టీం గెలవబోతుందని అభిమానులు అనుమానిస్తున్నారు. టెక్నికల్ తప్పిదంతో స్క్రీన్ పై అలా వచ్చినట్లు తెలుస్తుండగా.. దీనిపై చెన్నై అభిమానులు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరి కొంతమంది క్రికెట్ ఫ్యాన్స్ మ్యాచ్ ముందే ఫిక్స్ అయినట్టుంది అనుకుంటున్నారు. ఒకవేళ నేడు జరగబోయే ఫైనల్ లో నిజంగానే చెన్నై ఓడితే మాత్రం ఇక మ్యాచ్ ఫిక్స్ అనే ఆరోపణలు మరింత ఎక్కువ కానున్నాయి అని చెప్పాలి.