
ఇకపోతే మోకాలి గాయంతో కొన్నాళ్లుగా బాధపడుతున్న బెన్ స్టోక్స్ చాలా రోజులుగా బౌలింగ్ చేయడం లేదు. ఇక తాజాగా పూర్తి ఫిట్‌నెస్ సాధించినప్పటికీ యాషెస్ సిరీస్ కోసం ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో కూడా రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఈ మ్యాచ్‌ను వామప్‌గా భావించిన ఇంగ్లండ్ ఆటగాళ్లు ఆడుతూ పాడుతూ గెలిచారని చెప్పుకోవచ్చు. ఇక 97/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో 3వ రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఐర్లాండ్.. 86.2 ఓవర్లలో 362 పరుగులకు పెవిలియన్ చేరింది.
ఆండీ మెక్‌బ్రైన్ 115 బంతుల్లో 14 ఫోర్లతో రెచ్చి పోయి 86 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. మార్క్ అడైర్ 76 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టి (88) హాఫ్ సెంచరీలతో రాణించారు. 162 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఐర్లాండ్‌ను ఈ ఇద్దరు ఆదుకున్నారని చెప్పుకోవచ్చు. అలా మొత్తంగా అద్భుతమైన ఆటతీరుని కనబరుస్తూ ఏడో వికెట్‌కు 163 పరుగులు చేసారు. ఇంకేముంది, కట్ చేస్తే ఇంగ్లండ్ విజయం ఖాయమైంది. ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ ఓడినా.. ఆ జట్టు టెయిలెండర్స్ ఇంగ్లండ్ బౌలర్లను మాత్రం ముప్పుతిప్పలు పెట్టారని చెప్పుకోవచ్చు. ఇంగ్లండ్ ముందు 11 పరుగుల లక్ష్యం నమోదవ్వగా.. ఇంగ్లండ్ 4 బంతుల్లోనే విజయాన్ని ఛేదించిందని చెప్పుకోవచ్చు.