‘కళ్ళముందే ప్రజల ప్రాణాల పోతుంటే కన్నీళ్ళు ఆగటం లేదు...కోవిడ్ పేషంట్ల ఆర్తనాదాలు వింటుంటే గుండె చెదిరిపోతోంది’... ఇవి తాజాగా నారావారి పుత్రరత్న నారా లోకేష్ చేసిన ట్వీట్లు. నిజమే కరోనా వైరస్ సెకెండ్ వేవ్ రోజు రోజుకు తీవ్రమైపోతోంది. ఆసుపత్రుల్లో చేరి ప్రాణాలు నిలుపుకుందామనుకున్న రోగుల్లో కొందరు ఆక్సిజన్ అందక చనిపోవటం బాధాకరమే. రాష్ట్రానికి ఇపుడు అందుతున్న ఆక్సిజన్ నిల్వలు రోగుల అవసరాలకు సరిపడా అందటం లేదన్నది వాస్తవం. ఆక్సిజన్ ఉత్పత్తి, సరఫరా మొత్తం కేంద్ర నియంత్రణలోనే ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. మన రాష్ట్రంలో ఉత్పత్తవుతున్న ఆక్సిజన్ను కూడా ముందు కేంద్రమే తీసేసుకుంటోంది. తర్వాతే మన అవసరాలకు ఇస్తోంది. దీనివల్ల మన ఆసుపత్రుల్లో అవసరమైన ఆక్సిజన్ కోసం ఇతర రాష్ట్రాల నుండి వచ్చే సరఫరాపైనే ఆధారపడాల్సొస్తోంది.




సకాలంలో ఆక్సిజన్ అందకనే తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో 11 మంది చనిపోయారు. రుయా ఆసుపత్రిలోనే కాదు హిందుపురం, అనంతపురం లాంటి పట్టణాల్లోని ఒకటిరెండు ఆసుపత్రుల్లో కూడా ఇలాంటి ఘటనలే జరిగాయి. ఆక్సిజన్ కోసం ఒక్కసారిగా పెరిగిపోయిన డిమాండ్ ను అందుకోవటంలో ప్రభుత్వం నానా అవస్తలు పడుతోంది. ఈ పరిస్ధితి ఒక్క ఏపిలోనే కాదు యావత్ దేశమంతా కనబడుతోంది. ఇలాంటి సమయంలో సంయమనం పాటించాల్సిన చంద్రబాబునాయుడు, నారా లోకేష్ అండ్ కో జనాలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నారు. గుండె చెదిరిపోతోందని, కన్నీళ్ళు ఆగటం లేదంటు లోకేష్ చేసిన ట్వీట్లు ఇందులో భాగమే.




బాధితులను చూసి లోకేష్ గుండె చెదిరిపోవటం, కన్నీళ్ళు ఆగకపోవటం ఇప్పుడే మొదటిసారి లేకపోతే గతంలో కూడా ఇలాగే జరిగిందా అన్నదే అర్ధం కావటంలేదు. చంద్రబాబు అధికారంలో ఉండగా గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాటలో 30 మంది చనిపోయారు. ఈ ఘటనకు కేవలం చంద్రబాబు ప్రచారపిచ్చే కారణం. అలాగే కృష్ణానదిలో ఓ పడవ ముణిగిపోవటంతో 22 మంది చనిపోయారు. విజయవాడలోని స్వర్ణా ప్యాలెస్ కోవిడ్ కేంద్రంలో చికిత్స చేయించుకుంటున్న 11 మంది అగ్నిప్రమాదంలో సజీవదహనం అయ్యారు. మరపుడు కూడా లోకేష్ కు గుండెచెదిరిపోయిందా ? ఆగకుండా కన్నీళ్ళు వచ్చాయా ? అన్నది తెలీలేదు. ఎందుకంటే పై ఘటనలు జరిగినపుడు లోకేష్ నుండి ఇలాంటి ట్వీట్లు కనబడలేదు అందుకే అనుమానం వచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: