ఆసియా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌ తొలిరోజే నాలుగు పతకాలతో అదరగొట్టింది. ఆదివారం ప్రారంభమైన ఈ టోర్నీలో మహిళల జావెలిన్‌ త్రోలో అన్నూరాణి (60.22 మీ) రజత పతకంతో భారత్‌కు బోణీ కొట్టింది.  మహిళల జావెలిన్‌ త్రోలో అన్నురాణి రజతం గెలిచింది. జావెలిన్‌ను 60.22 మీటర్ల దూరం విసిరి ద్వితీయ స్థానంలో నిలిచింది.

పురుషుల 3 వేల మీటర్ల స్టీఫుల్‌ఛేజ్‌లో అవినాష్‌ 8:30.19 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరి రజతం సాధించాడు.మహిళల 5 వేల మీటర్ల పరుగులో పారుల్‌ చౌధురి (15 ని.36.03 సె) వ్యక్తిగత అత్యుత్తమ టైమింగ్‌తో కాంస్య పతకం గెలుపొందింది.   ఇక మహిళల 100 మీటర్ల హీట్స్‌లో 11.28 సెకన్లలో లక్ష్యాన్ని చేరిన ద్యుతి.. తన పేరిటే ఉన్న 11.29 సెకన్ల రికార్డును అధిగమించింది.ఈ నేపథ్యంలో ఆమె గత ఏడాది గువాహటిలో 11.29 సెకన్లతో నెలకొల్పిన తన జాతీయ రికార్డును బద్ధలుగొట్టింది. 

హీట్స్‌-4లో అగ్రస్థానంలో నిలిచి సెమీఫైనల్లో ప్రవేశించింది. జిన్సన్‌ జాన్సన్‌ (800 మీ), మహ్మద్‌ అనాస్‌.. రాజీవ్‌ అరోకియా (400 మీ)లు కూడా సెమీఫైనల్లోకి వెళ్లారు.  ఇక, మరో స్టార్‌ అథ్లెట్‌ హిమాదాస్‌ వెన్నునొప్పి కారణంగా మహిళల 400 మీ. పరుగునుంచి వైదొలిగింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: