భారత్ ఆస్ట్రేలియా టూర్ కు వచ్చినప్పటినుండి ఇరు జట్ల మధ్య కొన్ని ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ముఖ్యంగా టెస్ట్ సిరీస్ ప్రారంభమైన దగ్గర నుండి ఆటగాళ్ళు ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. మూడవ టెస్టులో మ్యాచ్  డ్రాగా ముగిసినప్పుడు ఆసీస్ టీమ్ కెప్టెన్ టిమ్ పైన్ అశ్విన్ పై స్లెడ్జింగ్ కు పాల్పడ్డాడు. అదేవిధంగా  అదే టెస్టులో రిషబ్ పంత్ బ్యాటింగ్ చేసే ఈ సమయంలో స్టీవ్ స్మిత్ బంతి యొక్క  గార్డ్‌మార్క్‌ను చెరిపేయడం ఎంత వివాదాస్పదం అయిందో అందరికీ తెలిసిందే. భారత క్రికెట్ అభిమానుల తో సహా పలువురు సీనియర్ ఆటగాళ్లు స్మిత్ పై తీవ్ర విమర్శలు చేశారు.

స్మిత్ ఒక చీటర్ అంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులు ఓ రేంజ్లో విమర్శలు గుప్పించారు. తర్వాత స్మిత్ గార్డ్ మార్క్ చెరపలేదు అంటూ వివరణ ఇచ్చుకుని తనను తాను సమర్థించుకున్నాడు. అలాగే స్మిత్ చేసిన పనిని  ఆసీస్‌ కెప్టెన్‌ టిమ్‌ పైన్‌, కోచ్‌ లాంగర్‌ కూడా తోసిపుచ్చారు. దాంతో అభిమానులు కూడా ట్విట్టర్ వేదికగా స్మిత్ కు సారీ చెప్తూ "సారీ స్మిత్" అనే హ్యాష్ ట్యాగ్ తో ట్రెండ్ చేశారు. ఇదిలా ఉండగా తాజాగా బ్రిస్బేన్ టెస్ట్‌లో టీమిండియా ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ, స్మిత్‌ను అనుకరించాడు. ఆసీసీ బ్యాటింగ్ చేస్తున్న స‌మ‌యంలో ఓవర్‌ పూర్తి అయిన తర్వాత క్రీజ్ లో ఉన్న స్మిత్‌  లబుషేన్‌ వద్దకు వెళ్లి చర్చిస్తున్న సమయంలో హిట్ మ్యాన్ రోహిత్‌ శర్మ క్రీజ్ దగ్గరకు వచ్చి స్మిత్ వైపు చూస్తూ షాడో బ్యాటింగ్ చేస్తూ ముందుకి కదిలాడు.

అది చూసిన స్టీవ్ స్మిత్ తలదించుకుని చూసి చూడనట్టుగా ఉండిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ రోహిత్ కావాలనే చేశాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. స్టీవ్ స్మిత్ చేసిన పనికి రోహిత్ ఇలా టీజ్‌ చేశాడంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజెన్స్ ఈ వీడియోను తెగ ట్రెండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: