భారత క్రికెట్ జట్టులో స్థానం సంపాదించాలంటే తప్పనిసరిగా ఆటగాళ్లు అందరూ కూడా యో-యో టెస్ట్  పాస్ కావాల్సి ఉంటుంది అన్న విషయం తెలిసిందే.   అయితే ఒకప్పుడు ఆటగాళ్లు ఎక్కువగా ఫిట్నెస్ పై  దృష్టి పెట్టేవారు కాదు. కానీ యో-యో  ఫిట్ నెస్ టెస్ట్ బిసిసిఐ తెరమీదకు తెచ్చిన నుంచి ఎక్కువ మంది ఆటగాళ్లు ఫిట్నెస్ పై  దృష్టి పెడుతూ ఉన్నారు అనే విషయం తెలిసిందే . అయితే భారత క్రికెటర్ల ఫిట్ నెస్ ని మరింత పెంచేందుకు ఇటీవల బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక  నుంచి ఏ ఆటగాడైనా సరే భారత్ తరఫున అంతర్జాతీయ మ్యాచ్ ఆడాలంటే మాత్రం తప్పనిసరిగా   యో-యో టెస్ట్ పాస్  కావాల్సిందే అంటూ నిబంధన పెట్టి నడుంబిగించింది బీసీసీఐ.



 అంతేకాదు ఈ ఏడాది నుండి యో-యో టెస్ట్ మరింత కఠినతరం చేసే విధంగా కసరత్తులు చేస్తోంది.  బీసీసీఐ  మొదట యో యో టెస్ట్ ను  తెరమీదకు తీసుకు రాగా.. అంబటి రాయుడు,  యువరాజ్ సింగ్, సురేష్ రైనా తో పాటు కొంతమంది సీనియర్ క్రికెటర్లు కూడా యో-యో టెస్ట్ ఫెయిల్ కావడం ఆసక్తికరంగా మారిపోయింది. యో-యో టెస్ట్ కారణంగా ఎంతోమంది సీనియర్ క్రికెటర్ల కు చేదు అనుభవం ఎదురు కాగా.. ఎంతో మంది యువ క్రికెటర్లకు ఫిట్ నెస్  పై దృష్టి పెరిగింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం భారత జట్టులో ఉన్న దాదాపు అందరు ఆటగాళ్లు సిక్స్ ప్యాక్ తో కనిపిస్తూ ఉండటం గమనార్హం.



 అయితే రోహిత్ శర్మ, రిషబ్ పంత్ గత ఏడాది అధిక బరువుతో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. అంతేకాదు తరచు గాయాల బారిన పడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం బిసిసిఐ కీలక నిర్ణయం తీసుకుని త్వరలో యో-యో టెస్ట్ ను మరింత కఠినతరం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.  ఈ క్రమంలోనే జట్టులో మళ్లీ ఆటగాళ్లు  మరింత ఫిట్నెస్పై దృష్టి పెట్టే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త ఫిట్ నెస్ టెస్ట్ ప్రతిపాదనపై బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ బోర్డు సభ్యులతో చర్చలు జరుపుతున్నారట. ఒకవేళ యో-యో టెస్ట్ పాస్ అయినప్పటికీ మ్యాచ్ లో గాయపడి మళ్లీ ఫిట్నెస్ సాధించి జట్టు లోకి రావాలి అంటే యో-యో టెస్ట్ పాస్ కావడం తప్పనిసరిగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: