బరువు పెరిగితే చాలా మంది యోగా, జిమ్, రన్నింగ్ లాంటివి చేస్తూ వెయిట్ తగ్గడానికి ప్రయత్నిస్తుంటారు. కొందరు లైపో లాంటి సర్జరీలు చేయించుకొని నాజూగ్గా తయారవుతారు.అలాగే  అందరిలాగా తాము అంత ఎత్తుగా లేమని కొంతమంది బాధ పడుతుంటారు. కనీసం ఆరు అడుగుల ఎత్తు ఉండాలని అనుకుంటారు. ఇందుకు ప్రయోగాలు కూడా చేస్తారు. ఇందుకు కావాల్సిన ప్రయత్నాలు చేస్తారు. కానీ కొందరికీ సాధ్యమౌతుంది..మరికొంతమందికి సాధ్యం కాకపోవచ్చు.అయితే హైట్ పెరగడానికి ఓ యువకుడు కాస్మోటిక్ సర్జరీ చేయించుకున్నాడు.అయితే ఓ వ్యక్తి తాను ఉన్న ఎత్తు కంటే ఇంకా కొంచెం ఎత్తు పెరగాలి అని భావించి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 55 లక్షలు ఖర్చు పెట్టాడు.

అమెరికాలోని డల్లాస్‌కు చెందిన ఆల్ఫోన్సో ఫ్లోరెస్‌  అతడి ఎత్తు ఐదడుగుల పదకొండు అంగుళాలు. అయినా అతను ఆ ఎత్తుతో సంతృప్తిగా పడలేదు. ఇంకాస్తు ఎత్తు పెరగాలని నిర్ణయించుకున్నాడు. అందుకు లాస్‌వెగాస్‌లోని వైద్యులు కెవిన్‌ డెబీపర్షద్‌ను సంప్రదించగా, ఎత్తు పెరగడానికి సులువైన మార్గం లింబ్‌ లెంథనింగ్‌ కాస్మటిక్‌ సర్జరీని చేయించుకోవాలని సూచించారు.ఆల్ఫోన్సో ఇందుకు అంగీకరించాడు. ఆపరేషన్ పూర్తయింది. ఏకంగా 55 లక్షల రూపాయలు ఖర్చు అయింది..ఐదు అడుగుల 11 అంగుళాలు ఉన్న అతడు ఆరు అడుగుల 1 అంగుళానికి చేరుకున్నాడు. గత ఆగస్టులో ఈ సర్జరీ జరిగింది. ప్రస్తుతం అతడు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్కు గురికాకుండా ఆరోగ్యంగానే ఉన్నాడు. అయితే ఇలాంటి కాస్మటిక్ సర్జరీలు కొన్ని సందర్భాల్లో తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్ను చూపిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు


కాళ్లల్లోని ఎముకలకు రంధ్రం చేసి, వాటిని రెండుగా విడదీస్తారు. తరువాత వాటి మధ్య లోహంతో చేసిన ఒక రాడ్‌ను అమర్చి, కావలసిన పరిమాణానికి చేరుకునేవరకూ ప్రతి రోజూ దాన్ని ఒక్కో మిల్లీ మీటర్ చొప్పున పెంచుతూ ఉంటారు. ఇది సుదీర్ఘమైన ప్రక్రియ. మనిషి ఎత్తు క్రమంగా పెరిగేందుకు కాలి ఎముకలను కట్ చేసి ఓ డివైజ్ను ఇన్సెర్ట్ చేయడమే కాస్మోటిక్ లింబ్-లెంథినింగ్ సర్జరీ విధానమని ...ఈ చికిత్స చాలా క్లిష్టమైనదని, సుదీర్ఘమైనదని, నొప్పితో కూడుకున్న వ్యవహారమని తెలిసినా వందలాది మంది సర్జరీవైపే మొగ్గు చూపుతున్నారు. అయితే, దీనివల్ల రిస్క్ ఉందని, దీర్ఘకాలంలో అనారోగ్య సమస్యలొస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: