ఆటిజం అనేది ఒక జబ్బు కాదు. ఇది ఎదుగుదలకు సంబంధించిన ఒక మానసిక సమస్య మాత్రమే. ఆటిజం పిల్లలు శారీరకంగా చాలా ఆరోగ్యంగా ఉన్నప్పటికీ వారి మెదడులోని పనితీరులో కొంచెం లోపం ఉంటుంది. దీనివల్ల ఇతరులతో కలవ లేకపోవడం, భావ వ్యక్తీకరణ సరిగా చేయలేక పోవడం, పేరు పెట్టి పిలిచినప్పుడు వెంటనే స్పందించ లేకపోవడం, సైగలు పదేపదే చేయడం, ఎవరైనా సడన్ గా ముట్టుకుంటే తీవ్ర కోపం రావడం వంటి లక్షణాలు తలెత్తుతాయి. 30- 40 శాతం పిల్లలు తెలివి పరంగా వెనుకబడతారు కానీ సాధారణంగా ఈ పిల్లలకు చాలా తెలివితేటలు ఉంటాయి. దీని వల్ల చదువు పరంగా మిగతా పిల్లల కంటే ముందంజలో ఉంటారు కానీ సామాజిక పరంగా వెనుకబడతారు. వయసు పెరుగుతున్న కొద్దీ ఈ లక్షణాల తీవ్రత అధికమయ్యే ప్రమాదం ఉంది.  


ఆటిజం రుగ్మత రావడానికి అనేక కారణాలు ఉంటాయి. ఎంత త్వరగా ఈ మానసిక సమస్యను గుర్తిస్తే అంత త్వరగా దీని నుంచి బయట పడవచ్చు. కేవలం ఒక్క వైద్యుడే దీన్ని హ్యాండిల్ చేయడం అనేది అసాధ్యం. పిల్లల డాక్టర్లు, సైకాలజిస్ట్, స్పీచ్ థెరపీస్ట్ ఇలా ఒక్కో లక్షణాన్ని అధిగమించేందుకు ఒక్కో డాక్టర్ కావాల్సి ఉంటుంది. ఈ మానసిక లోపాన్ని కాలక్రమేణా అధిగమించవచ్చు.


ఐతే తమ లాగా ఏ తల్లిదండ్రులు కూడా బాధపడకూడదని.. భావితరాల పిల్లలు ఈ మానసిక రుగ్మతకు బాధితులు కాకూడదని డాక్టర్. శ్రీజారెడ్డి చాలా బలంగా తపన పడ్డారు. ఆమె తపనే "పినాకిల్ బ్లూమ్స్" ఆటిజం థెరపీ సెంటర్ కి నాంది పలికింది. ఆటిజం థెరపీ, స్పీచ్ థెరపీ, అక్యూపెషనల్ థెరపీ, సైకాలజికల్ కౌన్సిలింగ్, స్పెషల్ ఎడ్యుకేషన్, డాన్స్ థెరపీ, యోగ థెరపీ, ఫిజియో థెరపీ ఇలా ఎన్నో చికిత్సలు అందిస్తున్న ఏకైక ఆటిజం థెరపీ సెంటర్ "పినాకిల్ బ్లూమ్స్" ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచింది.


ఇటువంటి సమస్య ఎందుకు వస్తుంది? దీనికి పరిష్కారం ఏంటి? వంటి ప్రశ్నలకు సమాధానాలు కనుక్కొని దీన్ని సమూలంగా నిర్మూలించాలనే సంకల్పంతో డాక్టర్ శ్రీజా రెడ్డి శాస్త్రవేత్తలతో పరిశోధనలు చేయించడం ప్రశంసనీయం.











మరింత సమాచారం తెలుసుకోండి: