గర్భధారణ సమయంలో గర్భిణులు అనేక సమస్యలకు గురవుతుంటారు. ఇక గర్భిణీగా ఉన్నప్పుడు మహిళ శరీరంలో హార్మోన్లలో కలిగే మార్పుల వల్లనే అజీర్తి సమస్యలు వస్తుంటాయి. గర్భిణీ కడుపులో బేబీ పెరుగుతున్నా కొద్దీ మహిళ కడుపు భాగంలో ఒత్తిడి పెరుగుతుంటుంది. అది జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. అజీర్తి వల్ల గుండెనొప్పి, అసిడిటీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే.. గర్భిణీలు తమ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అసిడిటీ తక్కువగా వచ్చే ఆహారాన్నే తీసుకోండి.

అయితే గర్భిణులు ఒకేసారి ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకోకండి. కొంచెం కొంచెం ఆహారం తీసుకోవాలి. మూడు సార్లు ఎక్కువ ఆహారం తీసుకునే బదులు రోజుకు ఆరు సార్లు కొంచెం కొంచెం ఆహారం తీసుకోవడం మేలు. ఆకలి లేకున్నా కొంచెం కొంచెంగా కనీసం ఆరు సార్లు ఆహారం తీసుకోండి. రెగ్యులర్ గా ఒకే సమయానికి ఆహారం తీసుకుంటుంటే అజీర్తిని తగ్గించొచ్చు. ఇక కొంతమంది మహిళలకు వచ్చే కడుపు సంబంధిత సమస్యలకు పాలు సరైన పరిష్కారం. పాలు ఇష్టం లేని వాళ్లకు ఐస్ క్రీమ్, యోగర్ట్ బెస్ట్ ఆప్షన్. అయితే.. కొంతమందికి పాలు తాగినా కూడా అజీర్తి సమస్య తగ్గదు. పాలు ఇష్టం లేనివాళ్లు మాత్రం వాటి బదులు వేరే ట్రై చేయండి.

ఇక కొంతమంది రాత్రి పొద్దుపోయాక తింటుంటారు. పొద్దు పోయాక తింటే అజీర్తి సమస్యలు పెరుగుతాయి. రాత్రి పూట జీర్ణ వ్యవస్థ కొంచెం నెమ్మదిగా పని చేస్తుంది. అందుకే.. ఒకవేళ రాత్రి పూట మీకు ఆహారం తినడం లేటయితే ఎక్కువ మోతాదులో తినకండి. కొంచెమే తినండి. ఎక్కువ తింటే జీర్ణం అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. తెల్లారి కూడా మీరు రాత్రి తిన్న ఆహారం ఇంకా కడుపులోనే ఉండి ఆకలి వేయదు. అజీర్తిని తగ్గించడం కోసం లేనిపోని తిండి తినకండి. దాని వల్ల మీ అజీర్తి సమస్యలు తగ్గడం పక్కన బెట్టండి. ఇంకా పెరిగే అవకాశం ఉంది. టెంప్టింగ్ గా ఉండే ఫ్రూట్ జ్యూసులు, చాకొలేట్లు, జంక్ ఫుడ్ మాత్రం అస్సలు తినకండి.

మరింత సమాచారం తెలుసుకోండి: