టీఆర్‌ఎస్‌ ఇటీవల కేంద్రంపై అనేక విషయాల్లో పోరాడుతోంది. అందులో ధాన్యం కొనుగోలు అంశం కీలకమైంది. కేంద్రం తెలంగాణపై వివక్ష చూపుతోందని.. పంజాబ్‌లో పండే ధాన్యం మొత్తం కొంటున్న కేంద్రం తెలంగాణలో పండే ధాన్యం మొత్తం కొనడం లేదని వాదిస్తోంది. అయితే.. ఈ అంశంపై కాంగ్రెస్‌ విమర్శలు గుప్పిస్తోంది. టీఆర్‌ఎస్‌ సర్కారు తప్పిదాల కారణంగానే రైతులు ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.

అయితే.. ఇటీవల హరీశ్ రావు కూడా తరచూ కేంద్రాన్ని విమర్శిస్తున్నారు. దీనిపై స్పందించిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. మామ చల్లని చూపుకోసం అల్లుడి ఆరాటం చూస్తే జాలేస్తోందని విమర్శించారు. భవిష్యత్ లో పారా బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని మీ మామ ఆదేశంతో రాసిచ్చిన లేఖ ఇదిగో చూడండి హరీష్ అంటూ సోషల్ మీడియాలో ఓ లేఖ పోస్ట్ చేశారు. మా పార్టీ సెంట్రల్ హాల్ లో ఫోటో షూట్ చేయదని.. రైతుల కోసం నిఖార్సైన ఫైట్ చేస్తుందని రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: