విధి ఎంత విచిత్రమైందో.. ఎంతటి బలీయమైందో ఈ ఘ‌ట‌న‌ను చూస్తే అవగతమవుతుంది.  కరోనా కాటుకు  జన జీవితాలు ఎలాంటి దయనీయ స్థితికి చే రుతున్నాయో సాక్షాత్క‌రిస్తుంది.  హ‌ఠాన్మ‌ర‌ణం చెందిన భార్యను క‌ట్టుకున్న భ‌ర్త‌తోపాటు క‌డుపున పుట్టిన బిడ్డ కూడా క‌డ‌సారి చూడ‌లేక‌పోవ‌డం అక్కడు న్నవారిని కంటతడి పెట్టించింది.  

 

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజక్కపేట గ్రామానికి చెందిన కొత్తపల్లి ప్రతాప‌రెడ్డి ఉపాధి కోసం 15 ఏళ్ల క్రితం సౌదీ వెళ్లాడు. భార్య రామవ్వ (50) ఇం టి వద్దే  పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చింది. వారికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. మరో నాలుగు నెలల్లో ఇంటికి తిరిగి వస్తానని ప్రతాపరెడ్డి భార్యతో చెప్పాడు. 

 

అయితే సోమవారం రామవ్వ గుండెపోటుతో మృతి చెందింది. సౌదీలో భర్త, లాక్‌డౌన్‌ కారణంగా కూతురు భాగ్యమ్మ కర్ణాటకలో చిక్కుకుపోయారు. బం ధువులెవరూ రాలేని పరిస్థితిలో పెద్ద కూతురు శశిరేఖ, కుమారుడు, కొందరు గ్రామ పెద్దలతో కలిసి అంత్యక్రియలు నిర్వహించారు. రామవ్వ మరణం రా జక్కపేటలో విషాదాన్ని నింపింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: