నిత్యం అల్లర్లతో అల్లాడే కాశ్మీర్ లో అల్లర్లను కట్టడి చేయడానికి గానూ అంతర్జాల సేవలను ఎప్పటికప్పుడు కేంద్ర సర్కార్ ఆపేస్తూ ఉంటుంది. అక్కడ అల్లర్లు జరగకుండా ఉండటానికి దాని మీద అనవసర ప్రచారం లేకుండా ఉండటానికి గానూ ఈ నిర్ణయం తీసుకుంటుంది. అయితే ఇప్పుడు అక్కడ వాతావరణం కాస్త ప్రశాంతంగానే ఉంది. 

 

ఈ నేపధ్యంలో 2జి ఇంటర్నెట్ సేవలను మాత్రమే అనుమతి ఇస్తున్నారు. దీనిపై సుప్రీం కోర్ట్ లో పిటీషన్ దాఖలు అయింది. దీనిపై విచారణ చేసిన సుప్రీం కోర్ట్... 4జి ఇంటర్నెట్ అనుమతులపై స్పెషల్ ప్యానెల్ ని ఏర్పాటు చేసింది. హెచ్ఎంఏ కార్యదర్శి నేతృత్వంలో స్పెషల్ ప్యానెల్ కమిటిని ఏర్పాటు చేస్తూ త్రిసభ్య ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ప్యానెల్ ఏ నిర్ణయం తీసుకుంటుంది అని పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: