ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక శాఖ విషయంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే సంక్షేమ కార్యక్రమాల విషయంలో మాత్రం చాలా వరకు కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. ఆరోగ్య శాఖ మీద ప్రత్యేకంగా దృష్టి పెడుతుంది. ఆరోగ్య శ్రీ విషయంలో చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరిస్తుంది ఏపీ సర్కార్. కరోనాను కూడా ఆరోగ్య శాఖలో చేర్చింది.

దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేసారు. “గత పది నెలల్లో 134 కోట్ల వ్యయంతో 2.10 లక్షల మందికి ఆరోగ్య ఆసరా. ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం పొందాక కోలుకునే సమయలో అండ. డిశ్చార్జైన  48 గంటల్లోనే వారి ఖాతాల్లోకి రూ.5 వేలు. కుటుంబ పెద్ద కోలుకునే సమయంలో పెద్దదిక్కుగా మారిందీ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా. జగన్ గారి ముందు చూపునకు మచ్చుతునక.” అని ట్వీట్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: