ఏపీ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి సంచలనం నిర్ణయాలతో ముందుకు సాగుతుంది జగన్ ప్రభుత్వం. రాష్ట్రంలో లో జగన్ గారు ప్రవేశపెట్టే ప్రతి పథకం కూడా దేనికవే అన్నట్టుగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్రామ వాలంటరీ వ్యవస్థను దేశ ప్రజలు ఎంతో మెచ్చుకున్నారు అలాగే గ్రామాల్లో ఏర్పడిన సచివాలయాలు కూడా ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండటం వల్ల ప్రజలు ఎంతో సానుకూలత వ్యక్తం చేస్తున్నారు. అయితే జగన్ గారు ప్రవేశపెట్టే ప్రతి పథకానికి కూడా తనదైన శైలిలో నామకరణం చేస్తున్నారు.

 అలాగే కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో రూ. 15 వేల కోట్లతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఆంధ్రప్రదేశ్ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ పేరును వైఎస్సార్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్‌గా నామకరణం చేసారు. ఈ మేరకు అన్ని రకాల పనులు కూడా పూర్తయినట్టు రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. దానికి సంబంధించిన జీవో ను కూడా ప్రవేశపెట్టాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కడప స్టీల్ ప్లాంట్ కు సంబంధించి 2019లో సీఎం వైఎస్ జగన్ గారు శంకుస్థాపన చేశారు..

శంకుస్థాపన సందర్భంగా జగన్ గారు మాట్లాడుతూ కడప స్టీల్ ప్లాంట్ కు సంబంధించి మూడేళ్లలో అన్ని పనులు పూర్తి చేసుకుని పరిశ్రమ మొదలవుతుందని హామీ ఇచ్చారు అందుకు తగ్గట్టుగానే దానిపై ముమ్మర కసరత్తు చేస్తూ చక్క చక్క కడప స్టీల్ ప్లాంట్ కు సంబంధించిన పనులు పూర్తి చేస్తున్నారు. మరి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కడప స్టీల్ ప్లాంట్ కు వైయస్సార్ స్టీల్ ప్లాంట్ గా నామకరణ చేయడం పట్ల ప్రతిపక్షాలు విపక్షాలు ఎలా స్పందిస్తాయో అన్నది ఆసక్తి రేపుతుది. అయితే జగన్ గారు స్టీల్ ప్లాంట్ కి సంబంధించి పేరు మారుస్తారా లేక వైయస్సార్ పేరునే ఖరారు చేస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: