ఏపీలోని తిరుపతి ఉప ఎన్నిక ముగిసింది. ఓట‌ర్లు ఓట్లేసేందుకు పెద్ద‌గా ఆస‌క్తి చూప‌లేదు. కేవలం 63 శాతం పోలింగ్ మాత్రమే తిరుపతి ఉప ఎన్నికల్లో జరిగింది. పోలింగ్ శాతం తగ్గడంతో అధికార పార్టీలో ఆందోళన నెలకొంది. ఇక వైసీపీ నేత‌లు ముందు నుంచి 4 ల‌క్ష‌ల మెజార్టీ ఊహించుకుంటున్నారు. ఇప్పుడు పోలింగ్ శాతం ప‌డిపోవ‌డంతో మెజారిటీ తాము అనుకున్న రీతిలో రాదని అధికార పార్టీ వైసీపీ నేతలు నిరాశకు గురయ్యారు. వైసీపీ ప్రభుత్వంపై అపనమ్మకంతోనే ప్రజలు ఓట్లు వేయడానికి రాలేదని టీడీపీ చెబుతోంది. ఓటింగ్ సరళి తగ్గడంతో అధికార పార్టీ మాత్రం పూర్తి నైరాశ్యంలోకి వెళ్లింది.

మరింత సమాచారం తెలుసుకోండి: