ఈ ఏడాది తొలి త్రైమాసికంలో అమెరికా వృద్ధి రేటు ఊహించిన దాని కంటే తగ్గింది. 1.6శాతం పడిపోయింది. వరుసగా రెండో త్రైమాసికంలోనూ అమెరికా జీడీపీ తగ్గే అవకాశాలున్నాయి. జూన్ నెలలో ద్రవ్యోల్బణం 40 ఏళ్ల సరికొత్త గరిష్ఠానికి చేరుకుంది. అందుకే ఫెడరల్ రిజర్వ్ మరోసారి వడ్డీ రేట్లను పెంచవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. ఇవాళ సమావేశం కానున్న ఫెడ్ ఏ నిర్ణయం తీసుకుంటుందా అన్న ఆందోళన అందరిలోనూ ఉంది. ద్రవ్యోల్బణం తగ్గించడానికి వడ్డీ రేట్ల పెంపు అత్యవసరమని ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పోవెల్ ఇప్పటికే చెప్పేశారు.