ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోయింది. మనిషి జీవనశైలిలో కూడా ఎంతో మార్పు వచ్చింది. ఈ క్రమంలోనే పెరిగిపోయిన టెక్నాలజీ ఉపయోగించుకుంటూ మనిషి ఎన్నో సాధిస్తున్నాడు. అయితే ఇక ఇలా నాగరికతలో అడుగుపెడుతున్న మనిషి మాత్రం.. తనలో ఉన్న ధైర్యాన్ని మొత్తం కోల్పోతున్నాడు అన్నది అర్థమవుతుంది. ఎందుకంటే ఆలోచన శక్తిని కోల్పోయి చిన్న చిన్న విషయాలకి అనాలోచితం నిర్ణయాలు తీసుకుంటూ చివరికి జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్న వారు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇటీవల కాలంలో ఎలాంటి సమస్య వచ్చినా ఆ సమస్యకు పరిష్కారం ఒక్కటే ఆత్మహత్య అని ఆలోచిస్తున్న వారే ఎక్కువగా ఉన్నారు అని చెప్పాలి.



 ఈ క్రమంలోనే ఏదైనా కష్టం వస్తే ధైర్యంగా నిలబడి ఎదుర్కొంటున్న వారి కంటే ఇక ఆ కష్టానికి కృంగిపోయి బలవన్మరణాలకు పాల్పడుతున్న వారే కనిపిస్తున్నారు. ఇలా క్షణికావేషంలో నిర్ణయాలు తీసుకుని కుటుంబాల్లో విషాదాన్ని నింపుతూ ఉన్నారు అని చెప్పాలి. టీచర్ తిట్టిందని లేదా పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని లేదంటే తల్లిదండ్రులు మందలించారని ఇలా చిన్నచిన్న కారణాలకే ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఇక ఇటీవల మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో కూడా ఇలాంటి విషాదకర ఘటన జరిగింది.



 గంగరాజు అనే వ్యక్తి ఇంట్లో ఎవరూ లేని సమయం లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. క్షణికావేశం లో నిర్ణయాన్ని తీసుకొని చివరికి నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగానే ముగించాడు. అయితే గత కొన్ని రోజుల నుంచి గంగరాజు ఎలాంటి పనులు చేయకుండా మద్యం తాగుతూ ఇక ఇంట్లో భార్యతో గొడవ పడుతూ ఉండేవాడు. అయితే భార్య భర్త వేధింపులు తాళలేక పుట్టింటికి వెళ్ళిపోయింది. దీంతో మనస్థాపం చెందిన గంగరాజు ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: