ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... పనీర్ ఎంత రుచికరమైన వంటకమో అందరికి తెలిసిందే... అలాగే ఆరోగ్యానికి కూడా పనీర్ చాలా మంచిది.. పనీర్ తో మనం ఎన్నో రకాల వంటకాలు చేసుకోవచ్చు.. పనీర్ లో వుండే పోషకాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇక ఈ రుచికరమైన ఇంకా ఆరోగ్యకరమైన పనీర్ తో లాలిపాప్స్ ఎలా తయారు చేసుకోవాలో ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి....

పనీర్ లాలిపాప్స్ కి కావలసిన పదార్ధాలు:


పనీర్‌ తురుము – రెండున్నర కప్పులు,
బ్రెడ్‌ పౌడర్‌ – అర కప్పు,
జీడిపప్పు పేస్ట్‌ – పావు కప్పు,
అల్లం–వెల్లుల్లి పేస్ట్‌ – పావు టీ స్పూన్‌,
పచ్చిమిర్చి ముక్కలు – ఒకటిన్నర టీ స్పూన్లు,
పెరుగు – 2 టేబుల్‌ స్పూన్లు,
మిరియాల పొడి, జీలకర్ర పొడి – పావు టీ స్పూన్‌ చొప్పున,
ఆమ్‌చూర్‌ పౌడర్‌– 2 టీ స్పూన్లు,
మొక్కజొన్న పిండి – 2 టేబుల్‌ స్పూన్లు,
గుడ్లు – 3,
చిక్కటి పాలు – 1 టేబుల్‌ స్పూన్‌,
ఉప్పు – తగినంత,
నీళ్లు – అవసరాన్ని బట్టి,
నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా...


పనీర్ లాలిపాప్స్ తయారు చేసే విధానం:


ముందుగా పెద్ద బౌల్‌ తీసుకుని అందులో పనీర్‌ తురుము, జీడిపప్పు పేస్ట్, బ్రెడ్‌ పౌడర్, అల్లం–వెల్లుల్లి పేస్ట్, ఆమ్‌చూర్‌ పౌడర్, పచ్చిమిర్చి ముక్కలు, మిరియాల పొడి, జీలకర్ర పొడి, తగినంత ఉప్పు, పెరుగు, 2 కోడిగుడ్లు వేసుకుని బాగా కలుపుకోవాలి. అవసరాన్ని బట్టి నీళ్లు వేసుకుని ముద్దగా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్‌లా చేసుకుని, ప్రతి బాల్‌కి సన్నటి పుల్లను గుచ్చి పక్కన పెట్టుకోవాలి. అనంతరం రెండు చిన్న చిన్న బౌల్స్‌ తీసుకుని ఒకదానిలో మొక్కజొన్న పిండి, మరోదానిలో ఒక గుడ్డు, పాలు వేసుకుని, ఆ బాల్స్‌ని మొదట గుడ్డు మిశ్రమంలో ముంచి, వెంటనే మొక్కజొన్న పౌడర్‌ పట్టించి నూనెలో డీప్‌ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది.ఇక పనీర్ లాలిపాప్స్ రెడీ అయినట్లే...ఇంకెందుకు ఆలస్యం ఇక ఈ రుచికరమైన ఇంకా ఆరోగ్యకరమైన పనీర్ లాలిపాప్స్ మీరు ఇంట్లో ట్రై చెయ్యండి. ఇక ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటకాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.. ఇంకా మరెన్నో రుచికరమైన వంటకాలు ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: