
ఏకంగా నలుగురు వ్యక్తులు పోలీస్ డ్రెస్ వేసుకొని ఒక వ్యక్తిని విచారణ కోసం పిలిపించారు. ఆ తర్వాత ఆ వ్యక్తిని కారులో కూర్చోబెట్టి ఎంతో దూరం తీసుకెళ్లారు. ఇక ఆ తర్వాత అతని వద్ద నుంచి 35 లక్షల రూపాయలు కాజేసిన నకిలీ పోలీసులు.. ఇక అతనిని కారులో నుంచి అక్కడి నుంచి పరారయ్యారు. అయితే మోసపోయానని గ్రహించిన బాధితుడు.. వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. అయితే బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటన స్థలంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు.
తన వద్ద నుంచి నిందితులు దోచుకున్న 35 లక్షలలో 20 రూపాయల నోట్ల కట్టలే ఎక్కువగా ఉన్నాయని.. బాధితుడు పోలీస్ లకు ఫిర్యాదులు తెలిపాడు. ఇక ఆ తర్వాత పాత ఢిల్లీలోని వ్యాపారుల దగ్గర 20 రూపాయల నోట్ల వినియోగం ఎక్కువగా ఉందని పోలీసులకు ఇన్ ఫార్మర్ల నుంచి సమాచారం అందింది. కొంతమంది వ్యక్తులు నోట్లను మార్చడానికి వస్తున్నారని సమాచారం రావడంతో ఇక అక్కడ మాటు వేసిన పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన నిందితుల్లో ఒకరు సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ గా కూడా ఉండడం గమనార్హం. ఇక పరారీలో ఉన్న మరో నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.