దేనికైనా ఆహ్వానించగా వచ్చిన వారు అతిధి. అతిథికి  “అతిధి మర్యాదలు” అందించటం ఆహ్వానితుల ప్రథమ కర్తవ్యం. ఇద్దరు అతిధుల మధ్య సాధారణ సంవాదం భరించ తగినదే. అంతకు మించి చేతులు కలిస్తే, మధ్య వర్తిత్వం వహించి సానుకూలత సాధించాలి లేదా చట్టం ద్వారా పరిష్కరించాలి. ఈ రెండు వదిలేస్తే "బాధిత అతిధి" ని అవమానించినట్లే. ఆంధ్రజ్యోతి,  ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి రెండింటిని తెలుగు దేశం పార్టీ స్వంత పత్రికలనేది ప్రచారంలో ఉన్న విషయం. చాల మంది టిడిపి మౌత్ పీసెస్ గా చెపుతూ ఉంటారు. పత్రికా ప్రమాణాలు, టీవీ చానల్‌ నైతిక విలువలను గాలి కొదిలేసి తెలుగు దేశం పార్టీ కరపత్రిక,  ప్రసార సాధనం లా మారిపోయింది. అందుకే, ఇప్పుడు ఆ పత్రిక,  ఆ చానల్‌ను ఏపీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ బహిష్కరించింది.


నిన్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధనరెడ్డిని చర్చా కార్యక్రమానికి ఆహ్వానించి, చర్చ జరుగుతున్న సందర్భంలో టీడీపీ ప్రయోజనాల కోసం వీలు కలిగేలా చేేసుకుంటూ దాడికి పాల్పడిన వ్యక్తి మీద కేసు కుడా నమోదు చేయించ కుండా తిరిగి ఈ రోజు చర్చకు ఆహ్వానించి తెలుగు దేశం పార్టీ ప్రయోజనాలు కాపాడడం కోసం ప్రయత్నించడం సిగ్గుచేటని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా మీడియా ముసుగులో పనిచేస్తున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి  - ఆంధ్రజ్యోతి పత్రికను నేటి నుంచి "బీజేపీ విలేకరుల సమావేశాల" కు కూడా ఆహ్వానించరాదని, ఆ టీవీ చానల్ చర్చా కార్య క్రమాలలో బీజేపీ ప్రతినిధులు పాల్గొన రాదని పార్టీ నిర్ణయించింది.




ప్రజలు చేత క్షమించబడని నాయకుడు - దురాశ పరుడు, తన అవసరం కోసం మర్యాద సైతం మరచి, రోడ్డెక్కి రచ్చ చేయగల (అ)రాచకీయ దురంధరుడు అబద్ధాల కోరు, మాట నిలుపుకొని ఈ వ్యక్తి  కోసం తాను పరిస్థితులను ఆకళింపు చేసుకొని వ్యవహరించకుండా తన ఉనికినే ఫణంగా పెట్టిన ఏబీఎన్ గ్రూప్ ఏమి సాధించాలని అనుకుంటుందని విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు. బిజెపితో, పవన్ కళ్యాణ్ తో ఏర్పడ్డ మైత్రి ద్వారా నే 2014లో ఎపిలో నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో  తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చింది.




ఆ తరవాత చంద్ర బాబు వేసిన కుప్పిగంతులు, అప్పటి ప్రతిపక్షం వైసిపి మరియు బిజెపి తదితర పార్టీలతో పెట్టుకున్న గిల్లికజ్జాలు, పలు సందర్భాల్లో తీసుకున్న యు-టర్నుల గురించి చెప్పాలంటే ఒక చరిత్ర అవుతుంది. చివరికి నరేంద్ర మోడీ, ఏనాడో వదిలేసిన అయన ధర్మపత్నిని సైతం రచ్చకీడ్చారు. ఆఖరికి నరేంద్ర మోడీకి వ్యతిరేఖంగా కాంగ్రెస్ ను కలుపు కొని దేశ వ్యాప్త విపక్షాలతో సమైక్య రాజకీయ సంఘటన నిర్మించటం ఇదంతా అవసరమా! అంటూ పలువురు రాజకీయవేత్తలు అంటున్న వేళ - ఏబీఎన్ చేసిన ఈ తప్పిదం టిడిపికి గొడ్డలి పెట్టు లాంటిది. 



తనకు పదవి అధికార దురభిమానం కాకపోతే! తెలుగు దేశం సృష్టికర్త ఎన్టీయార్ జీవితమంతా ఎవరితో నైతే పోట్లాడారో వారి కాళ్ల వద్ద టిడిపి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు. ఇలాంటి నాయకుణ్ణి కొన్ని ప్రసార మాధ్యమాలు " నేడు జీవంలేని ఆ శవాన్ని భుజాన వేసుకొని మోస్తున్నాయి" అంటూ ఎబిన్ తదితరాలపై ఆగ్రహిస్తున్నారు. వైసిపి తామర తంపరగా తప్పులు చేస్తున్న వేళ వ్యూహాత్మకంగా దెబ్బగొట్టకుండా ఇలా తప్పుడు పనులతో నిస్తేజమైపోవటం ప్రజాస్వామ్య ప్రేమికులకు కాస్త ఇబ్బందే.    




అయినా మీడియా అధినేత ఇష్టాయిష్టాలు వేరు. ప్రసార మాధ్యమం లేదా  పత్రిక నిర్వహణ వేరు. ప్రజలు నాయకుడిగా అనుభూతి చెందని వారిని పాఠకులు భరించరు. కానీ ఆ పత్రిక చందా కొన్న నేరానికి నేడు పాఠకుల వేదన వర్ణనాతీతం.



"విషువర్ధన్ రెడ్డి నా బంధువు కాదు,  నా స్నేహితుడు కాదు, కనీసం పరిచయస్తుడు కూడా కాదు. నేను వైసిపి, బిజెపి అభిమానిని కూడా కాదు ఒక సాధారణ పౌరుణ్ణి - అయినా ఏబీఎన్ దురాగతాన్ని గర్హిస్తున్నాను. నాకు తోచిన విధంగా ఏబీఎన్ పట్ల  వ్యతిరేఖత ఇలా ప్రదర్శిస్తున్నాను" అంటూ ఒక సీనియర్ సిటిజన్ కామెంట్ చేసారు.   




కానీ "ఏబీఎన్ స్టూడియోలో ఆయనకు జరిగిన అవమానానికి వ్యక్తిగతంగా చింతిస్తున్నాను. ఒక సభ్యత తెలియని వ్యక్తి చేసిన అగౌరవమైన పనికి ఆయన ఇబ్బంది పడ్డారు. ఈ విషయంలో ఏబీఎన్  పై ప్రజల్లా ప్రజల్లో తీవ్ర వ్యతిరేఖత వ్యక్త మవుతోంది. స్టూడియో వ్యక్తి గత ఇష్టా ఇష్టాలతో అతిధులకు అవసరం లేదు" అని పలువురు తమ ఫీలింగ్స్ ను వ్యక్త పరుస్తున్నారు. 




కానీ జరిగిన దుష్కృత్యం చూస్తుంటే అది ఏబీఎన్ స్టూడియో కాదు అమరావతి తెలుగు దేశం కార్యాలయం అంటున్నారు.  రాష్ట్ర బీజేపీ ఈ అధికారిక నిర్ణయాన్ని ఉల్లంఘిస్తూ, ఏబీఎన్ ఛానల్ తనకు నచ్చిన వారి ని ఆహ్వానించి, వారిని  ‘పార్టీ వాయిస్‌’ గా ప్రచారం చేసి ప్రజల్ని మోసం చేయాలని చూస్తే, ఏబీఎన్ చానల్‌ పై చట్టపరమైన చర్యలతో పాటు ఇతర అనువైన చర్యలకే బీజేపీ ప్రయత్నిస్తోంది. ఆంధ్రజ్యోతి ఏబీఎన్  యాజమాన్యం బేషరతుగా బీజేపీకి  క్షమాపణ చెప్పే వరకు ఈ బహిష్కరణ కొనసాగుతుందని బిజెపి వర్గీయుల ఉవాచ 




టీడీపీ మానస పుత్రిక అయిన ఆంధ్రజ్యోతి,  టీవీ చానల్ ని బీజేపీ కూడా ఛీత్కరించు కోవాల్సిన పరిస్థితే వచ్చింది. ఆ పత్రిక, ఆ చానల్‌ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర మంతటా చర్చకు దారితీసింది. అయినా పంచాయతీ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపని బిజెపి పై ఎందుకింత కక్షో? అర్ధం కాలేదు. టిడిపి కూడా పంచాయతీ ఎన్నికల్లో అంతగా ప్రభావం చూపలేదు. ఇలా చేస్తూ పొతే కనుచూపు మేరలో వైసిపి దుర్మార్గాలు, అపకీర్తి మూటగట్టుకున్నా టిడిపిని జనం అక్కున చేర్చుకోరనిపిస్తుంది.




అది టిడిపి కైనా, ఏబీఎన్ కైనా! ఆ వ్యక్తి చర్చలో పాల్గొనేంత యోగ్యుడు కూడా కాదు. అంత అయోగ్యుడు చేసిన అసందర్భ అమంగళకర సభా (అ)మర్యాదకు తగిన చట్టపరమైన చర్యకు ఉపక్రమించక పోవటం ఏబీఎన్ కు అత్యంత అగౌరవమే. ఈ సంఘటనతో పదిమంది దృష్టిలో "ఏబీఎన్ అంటే టిడిపి" అనుకునేటంత భావన అధికారికంగా కలుగుతుంది. ఇది ఎబిఎన్ కు దాని భవితవ్యానికి ప్రయోజనకారి కాదు.






మరింత సమాచారం తెలుసుకోండి: