పాలు.. బలవర్థకమైన ఆహారం.. పిల్లలు,పెద్దలు అంతా తాగుతారు. కానీ ఈ కల్తీయుగంలో మనం తాగుతున్నవి అసలైన పాలేనా అన్న సందేహాం రాక మానదు. మరి దాన్ని ఎలా తెలుసుకోవాలో చూద్దాం.. కొన్ని పద్ధతుల్లో కల్తీని కనిపెడితే మీ ఆరోగ్యానికే మంచిది. మీరు తాగేవి కల్తీ పాలా? అసలు పాలేనా? అన్న విషయం సులువుగా తెలుసుకోవచ్చు.


ఇందుకోసం పెద్దపెద్ద పరికరాలేవీ అవసరం లేదు. మీ ఇంట్లో చదునైన బండపై రెండు చుక్కలు పాలను వేస్తే అది మెల్లగా ఏదో ఓవైపు పారుతుంది. అలా పాలు పారిన దారిలో తెల్లగా కనిపిస్తే అవి స్వచ్ఛమైన పాలే. కల్తీ పాలు అయితే వేగంగా పారుతాయి. పాలు పారిన దారిలో తెల్లగా ఏమీ కనిపించదు.


ఇక కొన్ని సార్లు పాలలో స్టార్చ్ కలుపుతుంటారు. స్టార్చ్ మిల్క్‌ను గుర్తించాలంటే అందులో కొన్ని చుక్కలు అయోడిన్ కలపాలి. ఆ మిశ్రమం నీలి రంగులోకి మారితే అవి స్టార్చ్ కలిపిన పాలే. మరికొన్ని సార్లు యూరియా కల్తీ అవుతుంది. పాలల్లో యూరియా ఉందో లేదో కూడా కూడా తెలుసుకోవచ్చు. కొన్ని పాలు, సోయాబీన్ లేదా కందిపప్పు పొడి బాగా కలపాలి. ఐదు నిమిషాల తర్వాత అందులో ఎర్రని లిట్మస్ పేపర్ ముంచాలి. ఆ పేపర్ నీలి రంగులోకి మారితే అందులో యూరియా ఉన్నట్టే. ఆ పాలు విషంతో సమానం.


పాలల్లో ఫార్మాలిన్ ఉందో లేదో తెలుసుకోవచ్చు. 10 ఎంఎల్ పాలల్లో 5 ఎంఎల్ సల్ఫరిక్ యాసిడ్ కలపాలి. ఆ మిశ్రమం ఊదా రంగులోకి మారితే అందులో ఫార్మాలిన్ కలిపినట్టే. పాలు ఎక్కువ కాలం పాడవకుండా ఉండేందుకు ఫార్మాలిన్ కలుపుతుంటారు. పాలల్లో డిటర్జెంట్ కలిపారో లేదో తెలుసుకోవాలంటే 5 ఎంఎల్ పాలల్లో 0.1 ఎంఎల్ బీఎస్‌పీ సొల్యూషన్ కలపాలి. అందులో డిటర్జెంట్ ఉన్నట్టైతే పాలు ఊదా రంగులోకి మారతాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: