చాలామంది ఇది ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు . ఎవరైనా సరే చనిపోయిన వ్యక్తిని సాయంత్రం 6 దాటిందంటే వారి అంత్యక్రియలు జరిపించడానికి దహనం చేయడానికి ఒప్పుకోరు.  పక్క రోజు ఉదయం అయినా చేయించడానికి ఒప్పుకుంటారేమో కానీ సాయంత్రం ఆరు తర్వాత ఎక్కడా కూడా చనిపోయిన వ్యక్తి దహన సంస్కారాలు చేయరు . ఎందుకు చేయరు..? దాని వెనకే ఏదైనా రీజన్ ఉందా..? అనే విషయాలు ఇప్పుడు ఎక్కడ చదివి తెలుసుకుందాం..!!


గరుడ పురాణం లో జననం నుంచి మరణం వరకు 16 ఆచారాల గురించి అన్ని వివరంగా వివరించి ఉంటాయి . కాగా గరుడ పురాణంలో 16వ అంటే చివరి ఆచారమే ఈ దహనం . దీనికి అనేక నియమాలు కూడా ఉన్నాయి . ఈ పురాణాన్ని మహర్షి వేద వ్యాసుడు రచించాడు . కాగా గరుడ పురాణం ప్రకారం మరణం తర్వాత ఆ వ్యక్తిని సంధ్యా సమయంలో అనగా సాయంత్రం ఆరు తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ దహనం చేయకూడదు. సూర్యస్తమయం తర్వాత మృతదేహాన్ని దహనం చేయకూడదు అంటూ గరుడ పురాణం చెప్తుంది .



అలా చేయడం వల్ల ఆ వ్యక్తి ఆత్మకు శాంతి లభించదట . సూర్యస్తయం   తర్వాత స్వర్గ ద్వారాలు పూర్తిగా మూసివేయబడతాయట.  ఇదే ఎక్కువగా నమ్ముతూ వస్తారు జనాలు. దీని కారణంగానే ఆత్మ తన గమ్యస్థానాన్ని చేరుకోలేక పోతుంది అని సూర్యస్తమయం తర్వాత నరకం ద్వారాలు తెరుచుకుంటాయి అని .. అటువంటి పరిస్థితుల్లో దహన సంస్కారాలు చేస్తే ఆ చనిపోయిన వ్యక్తి నరకానికి వెళ్తారు అని .. ఒక నమ్మకం . మరణించిన వ్యక్తి రాత్రిపూట దహనం చేస్తే ఆత్మ నరక బాధను అనుభవిస్తుందట . తదుపరి జన్మలో అలాంటి వ్యక్తి శరీర భాగాలు దేనిలోనైనా లోపం ఉండొచ్చు అని .. కాబట్టి రాత్రిపూట లేదా సాయంత్రం సమయాలలో దహన సంస్కరణ చేయకూడదు అని గరుడ పురాణం చెబుతుంది . ఆ కారణంగానే చాలామంది సాయంత్రం ఆరు తర్వాత దహన సంస్కారాలు చేయడానికి ఒప్పుకోరు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: