పవర్ స్టార్ ఈ పేరు ఒక ప్రభంజనం, ఈ పేరులో తెలియని వైబ్రేషన్ ఉంది. మెగాస్టార్ సోదరుడిగా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ ఆణిముత్యం నేడు ఇండస్ట్రీ నే షేక్ చేసే స్థాయిలో నిలబడ్డారు పవన్. ఈయన ఫ్యాన్స్ సంఖ్య కు కొలమానం లేదు, వారి అభిమానానికి పరిమితి లేదు, పవన్ అంటే అభిమానులకు పిచ్చి ...ఆయన
పవర్ స్టార్ లైఫ్ స్టైల్ గురించి దాదాపు అందరికీ తెలుసు. అయితే కొందరికి ఆయన జీవిత విశేషాలు కొన్నిటిని గురించి తెలియక పోవచ్చు అవేంటో ఇపుడు చూద్దాం.

హీరో అసలు పేరు కొణిదెల కళ్యాణ్ బాబు 1971 సెప్టెంబర్ 2 న ఆంధ్రప్రదేశ్ లోని బాపట్లలో జన్మించారు. ఇప్పుడు ఆయన వయసు 50. వయసు అయిదు పదులు దాటుతున్నా ఇప్పటికీ అంతే హ్యాండ్సమ్ గా, ఎనర్జిటిక్ గా ఉన్నారు పవర్ స్టార్. ఈయన తల్లితండ్రులు వెంకట్రావు కొణిదెల అంజన దేవి కొణిదెల. ఇద్దరు సోదరులు, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. మెగా స్టార్ చిరంజీవి, నాగబాబు, విజయ దుర్గ, మాధవి రావ్. పవన్ కళ్యాణ్ బీకాం చదివారు. హైట్ 5 ఫీట్ 9 ఇంచెస్.  పవన్ కు అరటికాయ వేపుడు అంటే చాలా చాలా ఇష్టం. పవన్ కళ్యాణ్ ఫేవరెట్ నటులు చిరంజీవి , అమితాబ్ బచ్చన్, సావిత్రి. ఈ ప్రపంచంలో హాలిడే కి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఆస్ట్రేలియా ఫస్ట్ ఛాయస్ అట.

సమయం దొరికినప్పుడల్లా ఆస్ట్రేలియా లోని పలు ప్రదేశాల్లో షికార్లు చేసేవారట పవన్ కళ్యాణ్. 1996 లో అక్కడ 'అమ్మాయి ఇక్కడ అబ్బాయి' చిత్రం తో కెరియర్ ను స్టార్ట్ చేసిన పవర్ స్టార్ హిట్, ఫ్లాప్ లతో సంబందం లేకుండా క్రేజ్ ను పెంచుకుని సత్తా చాటారు పవర్ స్టార్. రీ ఎంట్రీ తర్వాత మరింత హుషారుగా జోరు పెంచి వరుస చిత్రాలు చేస్తున్నారు. తనకు అండగా నిలచి తనను అభిమానించిన ప్రేక్షకులకు అండగా నిలవడం కోసం ఇటు రాజకీయాల్లోకి  అడుగుపెట్టిన విషయం తెలిసిందే. జనసేన పార్టీని స్థాపించి ముందుకు తీసుకువెళుతున్నారు. పవన్ కళ్యాణ్ బహుప్రజ్ఞాశాలి నటుడు, రచయిత, దర్శకుడు అలాగే రాజకీయ నాయకుడు ఇలా ఎన్నో నైపుణ్యాలను ఆయనలో చూస్తున్నాం.

మరింత సమాచారం తెలుసుకోండి: