ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతుంది అని గత కొన్ని రోజుల నుంచి టాలీవుడ్ లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. దీనికి సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన ఇంతవరకు రాలేదు కానీ దాదాపు ఈ సినిమా ఖరారు అయ్యింది అని ప్రభాస్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ప్రభాస్ చేతిలో ప్రస్తుతం వరుస చిత్రాలు ఉన్నాయి.  చిన్న బడ్జెట్ చిత్రం కావడంతో తక్కువ రోజులలో మారుతి సినిమా చేయాలన్నది ప్రభాస్ ఆలోచన. అందుకే ఈ సినిమాను చేయడానికి ప్రభాస్ ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు.  రాజా డీలక్స్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. 

ప్రస్తుతం సలార్ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్న ప్రభాస్ ఈ ఏడాది సలార్ చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత వచ్చే ఏడాది ప్రాజెక్టు కే సినిమాను మొదలు పెట్టబోతున్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలు కాగా ప్రభాస్ లేని కొన్ని సీన్లు చిత్రీకరించి ప్రభాస్ రాక కోసం ఎదురుచూస్తున్నారు యూనిట్. మధ్య లో ఆయన గాయపడడం చికిత్స కోసం విదేశాలకు వెళ్ళడం వంటివి జరగడంతో ఈ సినిమా ఆలస్యం కావడానికి కారణం అయ్యింది.  

వచ్చే ఏడాదిలో ఈ సినిమా యొక్క షూటింగ్ ప్రారంభించి అదే ఏడాది లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ఆయన భావిస్తూ ఉండగా ఈ సినిమా చేస్తున్న సమయంలోనే మారుతి ప్రాజెక్టును కూడా ప్రారంభించి ఆ సినిమాని పూర్తి చేయాలని ఆయన భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఏ హీరో చేయని విధంగా ఆయన ఈ విధంగా వరుస భారీ చిత్రాలు చేసుకుంటూ పోతూ ఉండటం ఆయన అభిమానులను ఎంతగానో సంతోషపడుతుంది. మరి ప్రభాస్ మారుతి సినిమా పట్టాలెక్కాలంటే మారుతి ఇప్పుడు చేస్తున్న పక్కా కమర్షియల్ సినిమా సూపర్ హిట్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెబుతున్నారు. అలా అయితేనే ప్రభాస్ ఆయనతో సినిమా చేయాలని కూడా సూచిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: