పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ కెరియర్ లో బ్లాక్ బాస్టర్ గా నిలిచిన మూవీ లలో తొలి ప్రేమ మూవీ ఒకటి. ఈ మూవీ అప్పట్లో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని అద్భుతమైన రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఈ మూవీ ద్వారా పవన్ కళ్యాణ్ కు అద్భుతమైన క్రేజ్ కూడా లభించింది.

ఇది ఇలా ఉంటే తొలి ప్రేమ మూవీ నైజాం హక్కులను అప్పట్లో దిల్ రాజు దక్కించుకున్నాడు. ఈ మూవీ ద్వారా దిల్ రాజు భారీ లాభాలను కూడా అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా దిల్ రాజు ఓపెన్ హార్ట్ విత్ ఆర్ కే ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ లో భాగంగా దిల్ రాజు "తొలి ప్రేమ" మూవీ కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. దిల్ రాజు తాజాగా ఓపెన్ హార్ట్ విత్ ఆర్ కే షో లో మాట్లాడుతూ ... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన తొలి ప్రేమ మూవీ నైజాం హక్కులను 72 లక్షలకు కొనుగోలు చేశాము. అని ఆ సినిమా దాదాపుగా 2 కోట్ల 80 లక్షల కలెక్షన్ లను నైజాం ఏరియాలో సాధించింది.

అని ఆ మూవీ ద్వారా చాలా లాభాలను పొందాము అని దిల్ రాజు తాజాగా చెప్పు కొచ్చాడు. తొలి ప్రేమ మూవీ కి కరుణాకరన్ దర్శకత్వం వహించగా , కీర్తి రెడ్డిమూవీ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కి దేవా సంగీతం అందించాడు. తొలి ప్రేమ సినిమా 24 జూలై 1998 వ సంవత్సరం విడుదల అయింది. తొలి ప్రేమ మూవీ ఇప్పటికి కూడా ప్రేక్షకుల నుండి అత్యంత ప్రజాదరణను పొందుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: