ప్రైవేటు రంగంలో పనిచేసే ఉద్యోగుల కూడా పిఎఫ్ ద్వారా భీమా పొందొచ్చు. ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్ ఫండ్ (పిఎఫ్) యాక్టివ్ ఖాతాదారులందరూ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ద్వారా భీమ పొందొచ్చు. ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్.. ఎంప్లాయిస్‌ డిపాజిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ స్కీమ్‌(ఈడీఎల్ఐ) కింద తమ వినియోగదారులకు మరణాంతరం ఇచ్చే భీమా ప్రయోజనాలను పెంచింది.



ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు మరణిస్తే వారికి కనీసం రెండున్నర లక్షల రూపాయలు భీమాగా ఇవ్వాలని నిర్ణయించగా అది ఫిబ్రవరి 15, 2020 నుంచి అమలవుతోంది. ఈ స్కీమ్ ద్వారా నామినీలు గరిష్టంగా రూ. 7లక్షల బీమా పొందొచ్చు. 2021, ఏప్రిల్ 28 నుంచి గరిష్టంగా మృతుల కుటుంబాలు 7 లక్షల రూపాయల బీమా పొందుతున్నారు. ప్రైవేటు ఉద్యోగుల కుటుంబాలకు ఆదాయ భద్రత కల్పించేందుకు భారత ప్రభుత్వం 1976 లోనే ఎంప్లాయిస్‌ డిపాజిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ స్కీమ్‌ ప్రవేశపెట్టింది. ఈ జీవిత బీమా పథకం పిఎఫ్ ఖాతాదారులందరికీ ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తుంది.



అయితే ఈ స్కీమ్ ద్వారా లబ్ది పొందే వారు ప్రత్యేకించి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ ప్రైవేటు కంపెనీ యజమానులు తమ ఉద్యోగుల జీతాల నుంచి నిర్దిష్ట నగదు EDLI స్కీమ్ కి చెల్లిస్తారు. మీరు పనిచేసే ప్రైవేట్ కంపెనీ ఈ స్కీమ్ ఎంచుకోకపోతే మీకు దీని గురించి తెలిసే అవకాశం ఉండకపోవచ్చు. ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్ ఫండ్ (పిఎఫ్) యాక్ట్ 1952 అనేది కొన్ని కంపెనీలకు ఈడీఎల్ఐ స్కీమ్ నుంచి తప్పుకునే వెసులుబాటు కల్పిస్తుంది. ఈ కంపెనీలు ఇతర ఆకర్షణీయమైన బీమా పాలసీలు తీసుకుంటాయి.



ప్రైవేటు ఉద్యోగులు దురదృష్టవశాత్తు మరణిస్తే వారి కుటుంబ సభ్యులు ఎంప్లాయిస్‌ డిపాజిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ స్కీమ్‌(ఈడీఎల్ఐ) ద్వారా కచ్చితంగా ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. బేసిక్ + నెలసరి శాలరీ ప్రాతిపదికన ఎంత బీమా ఇవ్వాలి అనేది నిర్ణయింపబడుతుంది. పిఎఫ్ ఖాతాదారుడు అకౌంట్లో సరాసరి అకౌంట్ ని బట్టి కూడా బీమా మొత్తం నిర్ణయించబడుతుంది. తాజా సవరణ ప్రకారం.. గరిష్టంగా 7 లక్షలు నామిని కి లభించేలా ఒక సూత్రం రూపొందించారు.



ఉదాహరణకి ఒక ఉద్యోగి 12 నెలల నెలవారీ జీతం 20వేల రూపాయలు, సరాసరి పిఎఫ్ అమౌంట్ రూ.2 లక్షలు అనుకుందాం.. అప్పుడు (₹15,000*35 + ₹1,75,000) రూ.7 లక్షల రూపాయలు నామినీ కి లభిస్తాయి. ఒకవేళ నామిని కూడా చనిపోతే వారి కుటుంబ సభ్యులకు ఇన్సూరెన్స్ దక్కుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: