‘ఫస్ట్ లుక్, టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చిందనందుకు సంతోషంగా ఉందని, అందరికీ కృతజ్ఝతలంటూ’ మహేష్ ట్వీట్ చేశాడు. ఈ సినిమాను సూపర్ హిట్ చేయడం కోసం చిత్ర యూనిట్ కృషి చేస్తున్నారని మహేష్ తెలిపాడు. సూపర్ స్టార్ కు మహేష్ బర్త్ డే గ్రీటింగ్స్ ను కూడా తెలిపాడు.
దాదాపుగా రెండు నెలల విరామం తరువాత మహేష్ బాబు ఇలా ట్విట్టర్ లో పలకరించడం మహేష్ బాబు అభిమానులను ఖుషీ చేస్తుంది.
కాగా, మహేష్ బాబు కొత్త సినిమా టైటిల్ పై ఇంకా కనఫ్యూజన్ కొనసాగుతుంది. తాజాగా విడదలు చేసిన టీజర్, ఫస్ట్ లుక్ లో టైటిల్ వన్ అని చూపిస్తూ ‘నేనొక్కడినే’ అనే ట్యాగ్ లైన్ ఇచ్చారు. దీంతో అంతా సినిమా పేరు ‘వన్’ లేక ‘నేనొక్కడినే’ అనా అని తేల్చుకోలేక పోతున్నారు.