తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పటివరకు వచ్చిన ఎందరో గొప్ప గొప్ప దర్శకుల్లో ముఖ్యంగా మన ప్రేక్షకుల గుండెల్లో అద్భుత దర్శకత్వ ప్రతిభతో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న దిగ్గజ దర్శకులు కొందరున్నారు. ఆ విధంగా తెలుగు ప్రేక్షకులను హృదయానికి హత్తుకునే డైలాగులు, కడుపుబ్బా నవ్వించే తన మార్కు హాస్యంతో మంచి పేరు సంపాదించుకున్న దర్శకుడు జంధ్యాల. నిజానికి ఆయన మరణించి ఎన్నో ఏళ్లు గడుస్తున్నా, ఆయన తీసిన చిత్రాలు అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ కూడా తెలుగు ప్రేక్షకుల మనసులో నిలిచిపోతాయని చెప్పాలి. ముఖ్యంగా అప్పట్లో ఆయన తీసిన సినిమాల్లో కోట శ్రీనివాసరావు ప్రధాన పాత్రలో నటించిన అహ నా పెళ్ళంట సినిమా ఒక పెద్ద చరిత్ర సృష్టించిందని చెప్పుకోవాలి. 

 

ఇక అప్పట్లో ఆ సినిమా రిలీజ్ సమయంలో కనీసం ఒక్క సన్నివేశానికైనా ఎవరైనా నవ్వకుండా ఉంటే బహుమతి ఇస్తామని థియేటర్ల వారు ప్రకటించడం జరిగిందట. అంతలా ఆ సినిమా మన తెలుగు ప్రేక్షకులను హాస్యపు జల్లులతో గిలిగింతలు పెట్టింది. ఇక ముఖ్యంగా ఆ సినిమాలో పరమ లోభి గా లక్ష్మిపతి పాత్రలో దిగ్గజ నటుడు కోట శ్రీనివాసరావు కనబరిచిన సహజ నటన, పలికే డైలాగులు, నటించిన సన్నివేశాలు ఇప్పటికీ యూట్యూబ్ వంటి మీడియా మాధ్యమాల్లో లక్షలాది వ్యూస్ తో కొనసాగుతున్నాయంటే ఆ సినిమా యొక్క గొప్పతనం ఏంటో మనకు అర్ధం అవుతుంది. 

 

ఇక సినిమాలోని ఒక సన్నివేశంలో, రోజూ ఒంటికి లుంగీలు కట్టుకోవటం ఆపై వాటిని ఉతకడం, ఆరేయడం, నీళ్ల ఖర్చు, సబ్బు ఖర్చు, డబ్బు ఖర్చు ఇదంతా శుద్ధ దండగ. కాబట్టి పేపర్ లుంగీ చుట్టుకుంటే రాత్రంతా ఎంతో హాయిగా పడుకోవచ్చని తన భార్యతో కోట చెప్పే డైలాగ్ మనల్ని కడుపుబ్బ నవ్విస్తుంది. అయితే కేవలం ఆ ఒక్క డైలాగ్ మాత్రమే కాక, సినిమాలో చాలా సీన్స్ ప్రేక్షకుల్ని విపరీతంగా అలరించాయి. అయితే జంధ్యాల మరణం తర్వాత అటువంటి సినిమాలకు కాలం చెల్లిందని, ఇకపై అటువంటి సినిమాలను చూడలేమని ఇప్పటికీ కొందరు ప్రేక్షకుల్లో నిరాసక్తి నెలకొని ఉంది....!!

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: